April 22, 2025
SGSTV NEWS
CrimeTelangana

భార్య ఎంతకు తెగించిందంటే!.. భర్తకు కరెంట్‌ షాక్‌ పెట్టి…

హైదరాబాద్‌లోని కేపీహెహ్‌బీలో దారుణం చోటుచేసుకుంది. భర్తపై విరక్తి చెందిన ఓ భార్య చెల్లెలి భర్తతో కలిసి అతనికి కరెంట్‌ ఇచ్చి హత్య చేసింది. హత్య తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టి.. సొంతూరుకు వెళ్లిపోయింది. భర్త ఎక్కడని కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది.


రోజురోజుకు ఆడవాళ్లు చేస్తున్న దారుణాలు పెరిగిపోతున్నాయి. రోజు ఎక్కడో అక్కడ వాళ్లు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తలను భార్యలు హత్యచేసిన ఘటనలు మనం చాలానే చూశాం.. కానీ హైదరాబాద్‌లోని KPHBలో ఓ మహిళ భర్తపై విరక్తి చెంది అతన్ని చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సాయిలు అనే వ్యక్తికి కవిత అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్నేళ్లుగా భార్య భర్తలు వేరుగా ఉంటున్నారు. అయితే ఈ భార్య భర్తలు ఇద్దరికి వేరే వ్యక్తులతో వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ వేర్వేరుగా ఉన్నప్పటికీ భర్త సాయిలు, భార్య కవితను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో.. భర్త వేధింపులు భరించలేక పోయిన కవిత అతన్ను హత్య చేసేందుకు నిర్ణయించుకుంది.

అనుకున్న ప్రకారం చెల్లెలి భర్త సహాయంతో భర్త సాయిలుకు కరెంట్‌ షాక్ ఇచ్చి హత్య చేసింది భార్య కవిత. సాయిలు మృతదేహాన్ని ఒక స్థలంలో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తన చెల్లిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఈ హత్య తర్వాత కవిత వాళ్ల సొంతూరుకు వెళ్లిపోయింది. సాయిలు గురించి కుటుంబ సభ్యులు గ్రామస్తులు అడగ్గా.. పని కోసం అని వెళ్లిన సాయిలు కొన్ని రోజులుగా ఇంటికి తిరిగి రాలేదని కవిత చెప్పింది. కవిత మాటలపై అనుమానం వచ్చి సాయిలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సాయిలు హత్య ఉదంతం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via