సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మొహల్లా ప్రాంతానికి చెందిన తాజోద్దీన్‌ను దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. మసీదు నుంచి తాజోద్దీన్‌ను ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆదివారం అతడి మృతదేహాన్ని గుర్తించారు.
Crime : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మొహల్లా ప్రాంతానికి చెందిన తాజోద్దీన్ (29)ను దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. నాగులకట్ట మసీదు నుంచి తాజోద్దీన్‌ను శనివారం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆదివారం అతడి మృతదేహాన్ని గుర్తించారు.
తాజోద్దీన్‌ను కొంతమంది బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శనివారం మధ్యాహ్నం నమాజ్ కోసం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద అతని బైక్ ను రికవరీ చేశారు. ఆదివారం ఓ పాడుబడిన బావిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతదేహం మీద పెద్ద గాయాలు ఉన్నందున పొడిచి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమాని స్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..