Jalebi Baba: 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలఉ ఎదుర్కొంటున్న వివాదాస్పద ‘‘జిలేబీ బాబా’’ జైలులో మరణించాడు. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసి, వారి అసభ్యకరమైన వీడియోలను తీసి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడిన ఇతడు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జిలేబీ బాబాని బిల్లూరామ్, అమర్‌పురి అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇతడు హర్యానాలోని హిసార్‌లోని సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు
షుగర్ పెషెంట్ అయిన ఇతని ఆరోగ్యం మంగళవారం క్షీణించింది. రాత్రి సమయంలో ఒంట్లో ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం బుధవారం అతడి అంత్యక్రియల్ని నిర్వహించారు.
జిలేబీ బాబా ఎవరు..?
జిలేబీ బాబా పంజాబ్‌లోని మాన్సా నివాసి. తోహానాలో నివసించేవారు. తోహానాలో బండిపై జిలేబీలు అమ్మడం వల్ల అతనికి జిలేబీ బాబా అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఇతను బాబా అవతారం ఎత్తి తోహనాలో ఆశ్రమం స్థాపించారు. అతను తోహానాలోని బాబా బాలక్ నాథ్ మందిర్‌లో మహంత్‌గా మారాడు. 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు రావడంతో ఇతడి పేరు మార్మోగింది.
సెక్స్ స్కాండల్:
టీలో మత్తుమందు కలిపి 120 మంది మహిళలపై జిలేబీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఈ కేసులో పోలీసులు ఆశ్రమం నుంచి సీడీలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రాల పేరుతో మహిళలపై కిరాతక చర్యలకు పాల్పడేవాడు. 2018లో అతని వీడియోలు ఫతేహాబాద్ జిల్లాలో వైరల్ అయ్యాయి. దీంతో బాబా ఒక మహిళతో అసభ్యకరమైన స్థితిలో కనిపించాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి 2020లో చార్జిషీట్ దాఖలు చేశారు. మహిళలు, పోలీస్ అధికారులతో సహా దాదాపు 20 మంది సాక్షులు అతడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఫతేహాబాద్ కోర్టు జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 35 వేల జరిమానా విధించింది. అతని ఆశ్రమంలో ఓపియం కూడా దొరికింది. దీంతో అతడిపై NDPS చట్టం కింద కేసు కూడా నమోదు చేయబడింది.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం