ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు శశి గార్డెన్‌లో నివాసముంటున్నాడు. అయితే.. తన ఇంటి పక్కన ఉండే అక్రమ్ అనే వ్యక్తి తనపై కార్పొరేషన్‌తో పాటు ఇతర విభాగాల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా.. బేకరీ కారణంగా తన ఇల్లు వేడి అవుతుందని.. బేకరీని మూసివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
బాధితుడు బుధవారం రాత్రి తన సోదరులతో కలిసి వీధిలో తిరుగుతుండగా.. కత్తులు, కత్తెరతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు. అక్రమ్, అతని ఇద్దరు సోదరులు దాడి చేసి.. ఘటన అనంతరం పరారైనట్లు చెప్పాడు. కాగా.. స్థానికులు గమనించి షాబాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శశి గార్డెన్ ప్రాంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు అక్రమ్, ఖాసీం, ఆజాద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్‌గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..