November 21, 2024
SGSTV NEWS
CrimeNational

అమాయకంగా కనిపిస్తున్న యువతి.. ఈమె చేసిన పని తెలిస్తే షాకే!

Bengaluru News: సాధారణంగా అమాయకంగా యువతి కనిపిస్తే, ఆమె కూడా ఏదైనా పని కోసం ఎదురు చూస్తుంటే..ఎవరికైనా సాయం చేయాలనే అనిపిస్తుంది. అలానే ఓ యువతికి నమ్మి పని కల్పిస్తే.. ఆ ఇంటికి ఓనర్ కే షాకిచ్చింది.

సమాజంలో అనేక రకాల వ్యక్తిత్వాలు, ముఖభావాలు కలిగిన మనుషులు ఉంటారు. కొందరు గలగల మాట్లాడేస్తుంటారు. మరికొందరు మాత్రం అసలు ఏమి తెలియని అమాయకుల్లా సైలెంట్ గా ఉంటారు. ఇలాంటి వారిలో మనస్సులో ఏం ఉందో ఎవ్వరం కనీసం గుర్తించలేము. అమాయకంగా కనిపించే వారిని ఎక్కువగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే కొందరు అమాయకపు ముసుగులో ఘోరాలు, దారుణలు చేస్తుంటారు. నమ్మిన వారిని నిండ ముంచేస్తారు. తాజాగా యువతి కూడా తన అమాయకపు ఫేస్ ను పెట్టుబడిగా పెట్టి..నమ్మిన వారిని ముంచేసింది. ఆ యువతి చేసిన పని తెలిస్తే.. షాకవ్వాల్సిందే. మరి.. అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

Also read :హైదరాబాద్ లో దారుణం! పార్టీ పేరుతో సాప్ట్ వేర్ యువతిపై అత్యా*చారం!
సాధారణంగా అమాయకంగా యువతి కనిపిస్తే, ఆమె కూడా ఏదైనా పని కోసం ఎదురు చూస్తుంటే..ఎవరికైనా సాయం చేయాలనే అనిపిస్తుంది. అలానే బెంగళూరు నగరంలోని దివ్య అనే 22 ఏళ్ల యువతి విషయంలోనూ ఓ వ్యాపారి అనుకున్నాడు. బెంగళూరు శివారు ప్రాంతమైన యమలూరులోని దివ్యశ్రీ టెక్ పార్ విల్లాల్లోని ఒకదానిలో ఓ వ్యాపరవేత్త నివాసం ఉంటున్నారు. ఆయన పిల్లల సంరక్షణ కోసం దివ్యను నియమించుకున్నారు. చూడటానికి ఎంతో అమాయకంగా ఉండటంతో ఆమెపై ఎటువంటి సందేహాలు పెట్టుకోలేదు. అంతేకాక ఆమె వ్యక్తిగతం గురించి ఎలాంటి విచారమ చేయలేదు. ఈ క్రమంలోనే దివ్య పిల్లలను చూసుకుంటూ, ఇంట్లోని చిన్న చిన్న పనులు కాడ చేసేది. ఇక దివ్య ఇంట్లో పని బాగా చేస్తుండటంతో.. ఆ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలా వారిని నమ్మించిన తరువాత ఓ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది.

వ్యాపారి ఇంట్లో నెక్లెస్ తో సహా దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి పారిపోయింది. ఇంట్లో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వ్యాపారి మారతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారాణ చేపట్టి..నిందితురాలిని పట్టుకున్నారు. అనంతరం విచారించే క్రమంలో దివ్య హైడ్రామాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణకు తీసుకెళ్తుండగా చేయి కోసుకుని ఆస్పత్రికి వెళ్లాలంటూ డ్రామా ఆడింది. అయితే పోలీసులు అలెర్ట్ కావడంతో ఆమె డ్రామాకు తెరపడింది.

Also read :ఒంటరిగా ఉన్న వదిన పంచన చేరిన మరిది.. అదే అదుననుగా భావించి..!

ఇదే సమయంలో బంధువుల సహకారంతో ఆభరణాలను కూడా అమ్మేసింది. దివ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి రూ.30 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలో ఆమెకు సహకరించిన దివ్య బంధువులు మంజు, జోమన్‌లను కూడా అరెస్టు చేశారు. దివ్యశ్రీ ఇంట్లోని బంగారు ఆభరణాలు, దొంగిలించిన వస్తువులను విక్రయించేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. మొత్తంగా అమాయకంగా ఉంటూ.. ఇలాంటి ఘరాన మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారుalso read :Viral News: మహాతల్లీ నీకో దండం.. కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే..? పాపం భర్త పరిస్థితి..!

Related posts

Share via