June 29, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చి బావతో సహజీవనం.. చివరికి ఏమైందంటే?

ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగి భర్తలతో విభేదాల కారణంగా విడిపోయిన మహిళ అనుమానస్పద రీతిలో మృతి చెందింది. ఇంతకి ఏం జరిగిందంటే..


ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకోవడం,  ఆ తర్వాత విడాకులు తీసుకోవడం చాలా కామన్‌ అయిపోయింది. వీటితో పాటు అక్రమ సంబంధాలు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే అనేక ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా  ఈ లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌ లో ఉన్నవారు ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడం, మధ్యలోనే మరోకరితో సంబంధం పెట్టుకొని విడిపోవడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే..  కోపాలు పెంచుకొని ఆత్మహత్య చేసుకోవడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘోరాలు చాలానే చూస్తున్నాం. ఇదిలా ఉంటే..  తాజాగా ఓ యువతి కూడా ఈ లివ్‌ ఇన్‌ రిలేషిన్‌షిప్‌ ను కొనసాగిస్తూ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా ఘజియాబాద్‌ మోడీ నగర్‌లోని జగత్‌పురి కాలనీలో 27 ఏళ్ల యువతి అనుమానాస్పదరీతిలో మరణించింది. అయితే ఆ యువతికి ఇదివరకే రెండు పెళ్లిళ్లు కాగా, ఆ ఇద్దరు భర్తలను విడిచిపెట్టింది. ఆ తర్వాత  ఆ యువతి గత కొంతకాలంగా తన బావతో లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ క్రమంలోనే.. ఆమె బావ, అతని కుటుంబ సభ్యులే ఆ యువతిని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూమోడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసుల తెలిపిన మేరకు.. కస్బా పట్లలో నివాసం ఉంటున్న కృష్ణపాల్ సింగ్ కుమార్తె రాఖీ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేంది. ఈ క్రమంలోనే ఆమె చాలా కాలంగా.. జగత్‌పురి కాలనీలో తన మామ కుమార్తె భర్తకు.. బావ వరుసయ్యే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. కానీ, ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, శనివారం ఉదయం రాఖీ హత్యకు గురైనట్లు తమకు సమాచారం అందిందని రాఖీ తమ్ముడు అమిత్ తెలిపాడు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా రాఖీ మృతదేహం నేలపై పడి ఉందని పేర్కొన్నాడు.

అయితే రాఖీ మెడ, చేతులపై గాయాలు అయినట్లు గుర్తులు ఉన్నాయని సోదరుడు అమిత్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. రాఖీకి మొదటి వివాహం హుస్సేన్‌పూర్ గ్రామంలో జరగ్గా.. కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రెండో వివాహం ఘజియాబాద్‌లో జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఆ పెళ్లి కూడా ఎక్కువ రోజులు కొనసాగకపోవడంతో.. రెండో భర్త నుంచి కూడా విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. ఈ క్రమంలోనే అప్పటికే పెళ్లి అయిన వ్యక్తి తనకు వరసకు బావ కావడంతో అతనితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటుందని సమాచారం తెలిసింది. ఇక ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ జ్ఞాన్ ప్రకాష్ రాయ్.. ప్రాథమికంగా ఆత్మహత్య అని పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలుపారు.

Also read

Related posts

Share via