జగిత్యాల జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. పక్కా ఫ్లాన్‌తో భర్తను హతమార్చి, ఏం తెలియనట్లు నాటకమాడింది. చివరికి పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. తరచూ డబ్బులకోసం వేధిస్తున్నాడని భర్తను చంపినట్లు భర్త అంగీకరించింది. భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. అతని వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింది.
జగిత్యాల జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. పక్కా ఫ్లాన్‌తో భర్తను హతమార్చి, ఏం తెలియనట్లు నాటకమాడింది. చివరికి పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. తరచూ డబ్బులకోసం వేధిస్తున్నాడని భర్తను చంపినట్లు భర్త అంగీకరించింది. భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. అతని వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింది. ఈ మర్డర్‌లో కోడలికి అత్త సైతం సహకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త దామ్రాజ్‌పల్లిలో ఈ హత్య జరిగింది. మెట్‌పల్లికి చెందిన మండపల్లి భూమేష్ అనే యువకుడు 7 సంవత్సరాల క్రితం మల్లాపూర్ మండలం కొత్తదామ్రాజుపల్లికి చెందిన విజయతో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల మధ్య పంచాయతీ కూడా జరిగింది. అయినా కూడా గొడవలు తగ్గలేదు. దీంతో భార్య విజయ, ఆమె తల్లి వద్ద కొత్త ధామ్రాజ్‌పల్లి లో ఉంటుంది. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంది. అప్పుడప్పుడు భర్త వచ్చి డబ్బుల కోసం వేధించేవాడు. నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే అత్తగారింటికి వెళ్లాడు భూమేష్.. మరోమారు డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక లాభం లేదని మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తల్లీకూతుళ్లు కలిసి అతనిపై దాడి చేశారు. ఆ తరువాత అత్త లక్ష్మి, భార్య విజయలు పథకం ప్రకారం భూమేష్ ను చున్నితో మెడకు చుట్టారు. ఉరి బిగించారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత.. ఈ ఇద్దరు పరార్ అయ్యారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
Also read
- మార్గశిర మాసం.. ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేస్తే.. ఇంట్లో కనక వర్షం కురిసినట్టే..
- నేటి జాతకములు…22 నవంబర్, 2025
- అలసిపోయాను.. చావడానికి అనుమతి ఇవ్వండి.. సుప్రీంకోర్టు, పీఎంవోకు లేఖ!
- Hyderabad: 24 గంటల్లో డెలివరీ.. హాస్పిటల్కు వచ్చిన గర్భిణి మిస్సింగ్.. ఇక్కడే అసలు ట్విస్ట్
- హైదరాబాద్లో విషాదం.. లిఫ్టులో ఇరుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!





