రోజురోజుకూ మనషుల్లో మానవత్వం మంటకలిసి పోతుంది. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన కొందరు మత్తులో రక్త సంబంధాలనే తెంచుకుంటున్నారు. తాజాగా ఇలానే మద్యానికి బానిసైన ఒక పుత్రరత్నం..తాగేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని కన్న తల్లిని కడతేర్చాడు.. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహీర్ (మం) బడంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న బండమీది గోప్యమ్మ అనే మహిళకు బాలరాజు అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇతను గత కొన్నాళ్లుగా ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో తరచూ తాగి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకునేవాడు. కొన్నాళ్ల క్రితమే ఇతనికి పెళ్లి కూడా అయ్యింది. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా తన తల్లి ఇంటి పక్కనే వేరే ఇంట్లో బాలరాజు ఉంటున్నాడు.
కాగా ఇటీవలి కాలంలో మద్యానికి బాగా అలవాటు అయిన బాల్ రాజు.. శుక్రవారం రాత్రిఫుల్గా మద్యం తాగాడు.. దీంతో అతని దగ్గర డబ్బులు అయిపోయాయి.. తాగేందుకు ఇంకా డబ్బులు కావాలని.. కొంత మందిని అడిగి చూసాడు.. కానీ ఎవరు డబ్బులు ఇవ్వకపోవడంతో.. చివరికి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి గోప్యమ్మ వద్దకు వచ్చి తనకు డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు.
అయితే తన వద్ద డబ్బులు లేవని, ప్రతి రోజు మందు తాగడం ఎందుకు అని తల్లి బాలరాజ్ను ప్రశ్నించింది.. దీనితో ఇద్దరి మధ్య మాట మాట పెరగి గొడవ పెద్దదైంది. దీంలో రెచ్చిపోయిన బాల్రాజ్ అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని తల్లి తలపై బలంగా కొట్టాడు. దీంతో దీనితో ఆమె అక్కడిక్కడే కుప్పుకూలీ పడిపోయింది. ఇది గమనించిన బాల రాజు అక్కడి నుండి పారిపోయాడు.
కొడుకు దాడి సమయంలో గోప్యమ్మ అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న గోప్యమ్మను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి ఆమె మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వా్స్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Andhra: రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ ఇదే..
- Telangana: 21 ఏళ్ల నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉంది.. దూరపు బంధువునని లోపలికి వచ్చాడు.. ఆపై
- Andhra: సీబీఐ నుంచంటూ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
- Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?
- Andhra News: కాకి పెట్టిన మంట..! కాలి బూడిదైన నాలుగిళ్లు.. అసలు మ్యాటర్ తెలిస్తే..





