SGSTV NEWS online
CrimeTelangana

రెచ్చిపోయిన ఆటోవాలా.. ఉద్రిక్తతకు దారి తీసి ఆటో రిక్షా డ్రైవర్ల ఆందోళన



ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన, హైదరాబాద్ నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్‌ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మహానగరంలో అక్రమంగా తిరుగుతున్న.. ప్రముఖ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాలను నిషేధించాలని కోరారు. ఆటో రిక్షా డ్రైవర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌తో నగరంలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు వ్యవహరించిన తీరు నగరవాసులకు భయబ్రాంతులకు గురి చేసింది.

ముఖ్యంగా పాతబస్తీ మలక్ పేట, అజాంపురా, చాదర్ ఘాట్, సైదాబాద్ లో రోడ్లపై తిరుగుతున్న ఆటోలపై డ్రైవర్లు రౌడీలా రెచ్చిపోయి అడ్డుకుని ప్రయాణికులను బలవంతంగా దింపివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పాతబస్తీలోని పలు ప్రాంతాలలో పోలీసులతో వాగ్విదానికి దిగారు. అధికారులు తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని నగరవాసులు విజ్ఞప్తి చేశారు. కిలో మీటర్‌కు రూ.20, మినిమం చార్జీ రూ.50కు పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేల సహాయం అందజేయాలన్నారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు..

Also read

Related posts