SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: కవలలతో ఇంట అడుగు పెడుతుందనుకున్న శ్రీమతి.. కన్ను మూయడంతో..



ఆశలు అడియాశలు అయిపోయాయి.. ఆమె కడుపు పండింది.. ఇంటికి కవలలు వస్తారనుకుంటే.. కడుపున పిల్లలతో పాటు శ్రీమతి సైతం ఈ లోకాన్ని వీడారు. దీంతో అతనికి జీవితంపై విరక్తి కలిగింది. తాను ఎవరి కోసం బతకాలని మనస్తాపం చెందాడు.. పాపం ..

ఇదో విషాద వార్త.. భార్య ఇక లేదన్న చేదు నిజాన్ని అతను జీర్ణించుకోలేక పోయాడు. అర్థాంగిలేని తన జీవితం వ్యర్థం అని భావించాడు. సంతోషాలు మోసుకొస్తుందని భావించిన శ్రీమతి.. అనంతలోకాలకు వెళ్లిపోవడంతో అతని గుండె ముక్కలైంది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనై భర్త కూడా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని చాలించాడు. ఈ ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్‌(40)  తన భార్య శ్రావ్య(35)ను తీసుకొని ఏడాదిన్నర క్రితం శంషాబాద్‌కు వచ్చారు. అతను విమానాశ్రయంలో ప్రవేట్ జాబ్ చేస్తున్నారు. పిల్లలు కలగకపోవడంతో.. ఐవీఎఫ్‌ ప్రక్రియ ద్వారా శ్రావ్య ప్రగ్నెంట్ అయ్యారు. కవలలు పెరుగుతున్నట్లు డాక్టర్లు చెప్పడంతో దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రజంట్ 8 నెలల గర్భిణి అయిన ఆమెకు 16వ తేదీ రాత్రి సమయంలో కడుపులో నొప్పి రావడంతో అత్తాపూర్‌లోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. టెస్టులు చేయగా.. శ్రావ్య గర్భంలోని కవలలు మృతి చెందినట్లు తేలింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో అత్యవసర వైద్యం కోసం శ్రావ్యను గుడిమల్కాపూర్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ ఆమె కూడా లోకాన్ని వీడారు. దీంతో ఆవేదనకు గురైన విజయ్‌… శంషాబాద్‌లోని ఇంట్లో ఉరేసుకున్నారు. దంపతులతో పాటు వారి కవలల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Also Read

Related posts