SGSTV NEWS online
CrimeTelangana

Telangana: ఆటగదరా శివ.. కూతురు అన్నప్రాశన రోజే.. తండ్రిని వెంటాడిన మృత్యువు..



తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తెకు ఆరోజు అన్నప్రాశన..ఈ వేడకు ఏపీలోని ద్వారకాతిరుమలలో ఘనంగా నిర్వహించారు తెలంగాణకు చెందిన ఓ కానిస్టేబుల్. ఈ వేడుకతలో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు.. కానీ ఇంతలోనే పెను విషాదం ముంచుకొచ్చింది.. సాయంత్రం బయటకెళ్లిన చిన్నారి తండ్రి తిరిగి ఇంటికి రాలేదు. గుండెపోటుతో మృతి చెందాడు.

కుమార్తె అన్నప్రాశన రోజునే తండ్రి గుండెపోటుతో మృతి చెందిన ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెలుగు చూసింది. కూతురు అన్నప్రాశాన చేశామన్న ఆనందంలోంచి బయటకు రాకముందే ఆ కుటుంబాన్ని విషాదం ముంచెత్తిండి. సాయంత్రి బయటకెళ్లి వాస్తానని చెప్పిన చిన్నారి తండ్రి గుండె పోటుతో మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామానికి చెందిన పల్లబోయిన హన్మంతరావు అనే వ్యక్తికి విజయ అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమార్తె కూడా ఉంది. హన్మంతరావు సత్తుపల్లి మండలం గంగారం పోలీస్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అతను కుటుంబంతో కలిసి సత్తుపల్లిలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు.

అయితే ఈ దంపతులు తమ కుమార్తెకు శుక్రవార ఏపీలోని ద్వారకాతిరుమలలో అన్నప్రాశన వేడుకను కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక తర్వాత ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషంగా ఇంటికి చేరకున్నారు. అయితే ఇంటికొచ్చాక హన్మంతరావు.. ఏదో పనిమీద ఇంటి నుంచి బయటకెళ్లాడు. ఈ క్రమంలోనే అతను అకస్మాత్తుగా రోడ్డుపై కుప్పకూలాడు.. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ హన్మంతరావును పరీక్షించిన వైద్యులు అప్పటికే అతని మరణించినట్టు నిర్ధారించారు. ఈ విషయం విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read

Related posts