ప్రేమించాడు.. అండగా ఉంటానన్నాడు. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. కులం పేరుతో దూరం పెట్టి.. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో నా బిడ్డకు.. నాకు.. న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేస్తోంది. ఈ ఘటన ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన రేణుకకు నకిరేకల్ మండలం నెల్లిబండకు చెందిన అశోక్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. పెండ్లైన కొన్నేళ్ళకు అశోక్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన విష్ణు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అశోక్ మృతితో అయోమయంలో ఉన్న రేణుకకు విష్ణు పరిచయమయ్యాడు. నీకు అండగా నేనుంటానని విష్ణు నమ్మబలికాడు. సహజీవనం చేస్తుండగా, తనను పెళ్లి చేసుకోవాలని రేణుక నిలదీయడంతో.. విష్ణు రహస్యంగా చెరువుగట్టు దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాడు. ఇదే సమయంలో రేణుకకు తెలియకుండా విష్ణుకు తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి చేశారు.
వారిద్దరికీ ఇద్దరు పిల్లలు జన్మించారు. సహజీవనం చేస్తున్న రేణుకకు రెండుసార్లు అబార్షన్లు కూడా చేయించాడు. మూడోసారి అబార్షన్ చేసుకోవాలని విష్ణు.. రేణుకపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో రేణుక, విష్ణుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ససేమిరా అంటూ బిడ్డకు రేణుక జన్మనిచ్చింది. ఆ తర్వాత మనిద్దరి కులాలు వేరు అంటూ రేణుకకు దూరంగా విష్ణు ఉంటూ వచ్చాడు. నా బిడ్డకు.. నాకు న్యాయం చేయాలని నెల్లిబండలోని విష్ణు ఇంటి ఎదుట పసిపాపతో రేణుక ధర్నా చేస్తోంది. ఈ ఘటనపై గ్రామ పెద్ద మనుషులు సమక్షంలో పంచాయతీ నిర్వహిస్తున్నారు.
Also read
- Telangana: ప్రేమించానన్నాడు.. శారీరికంగా కలిశాడు.. కట్ చేస్తే.. పిల్లాడు పుట్టేసరికి
- ఇదేం పోయేకాలం రా.. ఇంట్లో పూజ చేసుకుంటున్న మహిళపై..!
- Garbarakshambigai: మహిళామూర్తులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత వెలిసిన క్షేత్రం-‘గర్భరక్షాంబిక ఆలయం’, తిరుకరుకావుర్
- నేటి జాతకములు…3 నవంబర్, 2025
- వికారాబాద్‌లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్!





