వివాహ సమయంలో 15 లక్షల వరకట్నంతో పది తులాల బంగారం తో పాటు తదితర లాంఛనాలను పుట్టింటి వారు శ్రావణ్ కు అప్పగించారు. అయినా సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించారు.. శ్రావణ్, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో కావ్య.. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి చెప్పింది.
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కావ్య (22) ను.. మూడు సంవత్సరాల క్రితం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్ అనే యువకునికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో 15 లక్షల వరకట్నంతో పది తులాల బంగారం తో పాటు తదితర లాంఛనాలను పుట్టింటి వారు శ్రావణ్ కు అప్పగించారు. అయినా సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించారు.. శ్రావణ్, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో కావ్య.. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి చెప్పింది. దీంతో వారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు.
పంచాయితీ పెట్టి.. పెద్ద మనుషులు శ్రావణ్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇద్దరూ కలుసుండాలని సూచించారు. అప్పుడు సరేనని ఒప్పుకున్న శ్రావణ్.. తన దుర్భుద్దిని మరోసారి చూపించాడు.. వేధింపులు మరింత పెరగడంతో తీవ్రంగా మనోవేదన చెందిన కావ్య.. ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కావ్య మరణానికి కారణమైన శ్రావణ్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





