జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం నిహారిక అనే వివాహిత హత్య కు గురయింది. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ నెల 12న జరిగిన 21 ఏళ్ల నిహారిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి బానిసై అప్పుల బారిన పడిన 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి శివ మాధవ రెడ్డి తన అప్పులు తీర్చుకునేందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో బయటపడింది.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి–నిహారిక దంపతులు వెంకటేశ్వర నగర్లో నివాసముంటున్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం భర్త డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య నిహారిక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. అనుమానం వ్యక్తం చేసిన భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలోనే ఇది సహజ మరణం కాదని వైద్యులు పోస్టుమార్టం లో గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీన్ని హత్యగా తేల్చారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడే నిందితుడు శివ మాధవ రెడ్డి నిహారిక ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిహారికకు శివ మాధవరెడ్డి దూరపు బంధువుగా తెలుస్తుంది.. తెలిసిన వ్యక్తి కావటంతో అతడిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆమె భర్త బయట ఉన్నాడని, పొరుగువారి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత దాడికి పాల్పడ్డాడు. నిహారికను గొంతు నులిమి శివ మాధవరెడ్డి హత్య చేశాడు. దీన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని బాత్రూంలో పడేశాడు. నిహారిక ఒంటిమీద ఉన్న బంగారు మంగళసూత్రం, ఒక జత బంగారు చెవిపోగులు, మూడు బంగారు ఉంగరాలు, అలాగే బెడ్రూమ్లో ఉన్న రూ.2,500 నగదును దొంగిలించాడు. అనంతరం ఇది సహజ మరణంలా కనిపించేలా సన్నివేశాన్ని సెట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, దొంగిలించిన నాలుగు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తిగా ఛేదించామని, నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నామని బాలానగర్ డీసీపీ వివరాలు వెల్లడించారు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూంలో శవాన్ని పడేశాడు. సహజ మరణంగా అనుకోవాలని టాప్ ను నిరంతరం తిప్పుతూనే వాటర్ బయటికి వచ్చేలా చేసాడు. నాలుగు తులాల బంగారం తో పాటు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. నిహారిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాక పోలీసులు మొదట నిహారిక సెల్ఫోన్ డేటాను విశ్లేషించారు. ఆ తర్వాత సాంకేతిక ఆధారాలతో శివ మాధవరెడ్డిని అరెస్టు చేశారు.
Also Read
- Andhra: రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ ఇదే..
- Telangana: 21 ఏళ్ల నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉంది.. దూరపు బంధువునని లోపలికి వచ్చాడు.. ఆపై
- Andhra: సీబీఐ నుంచంటూ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
- Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?
- Andhra News: కాకి పెట్టిన మంట..! కాలి బూడిదైన నాలుగిళ్లు.. అసలు మ్యాటర్ తెలిస్తే..





