Mahabub Nagar: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రూ.500 కోసం ఇద్దరి మధ్య మొదలైన వివాదం ఒకరి ప్రాణంతీసే వరకు వెళ్లింది. డబ్బులు తిరిగి ఇవ్వడం ఎందుకు.. అతన్ని చంపేస్తా పోలా అని భావించిన వ్యక్తి.. అవతల వ్యక్తిని గొంతునులిమి హత్య చేశాడు. రెండేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రూ.500 కోసం ఇద్దరి మధ్య మొదలైన వివాదం ఒకరి ప్రాణంతీసే వరకు వెళ్లింది. డబ్బులు తిరిగి ఇవ్వడం ఎందుకు.. అతన్ని చంపేస్తా పోలా అని భావించిన వ్యక్తి.. అవతల వ్యక్తిని గొంతునులిమి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. వీరన్నపేటకు చెందిన షాషెరియార్ ఆహ్మద్ న్యూటౌన్‌లోని పండ్ల దుకాణాల వ్యాపారులకు సహాయంగా ఉండేవాడు. వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అక్కడే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పండ్ల దుకాణాల పక్కనే ఉన్న నయాబ్ హోటల్‌లో మహ్మద్ సిద్దిక్ ఉల్లఖాన్ టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి డబ్బులు అవసరం పడడంతో తన సెల్‌ఫోన్‌ను ఓ పండ్ల వ్యాపారికి విక్రయించాడు. అయితే సిద్ధిక్ ఫోన్‌తో పాటు ఇవ్వాల్సిన ఛార్జర్ ఇవ్వలేదు. చార్జర్ తన రూమ్ వద్ద ఉందని.. షాహెరియార్‌ను పంపిస్తే ఇచ్చి పంపిస్తానని చెప్పాడు.
అయితే వీళ్లరికీ ముందు నుంచే పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చార్జర్ ఇవ్వడానికి సిద్ధిక్ ఉల్లాఖాన్ షాషాబ్ గుట్టలోని తన అద్దె నివాసానికి షాహెరియార్‌ను వెంటబెట్టుకొని వెళ్లాడు. సిద్ధిక్ నివాసానికి వెళ్లిన తర్వాత గతంలో తన వద్ద తీసుకున్న రూ.500 అప్పును చెల్లించాలని షాహెరియార్ అడిగాడు. దాంతో తన వద్ద డబ్బులు లేవని సిద్ధిక్ చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం షాహెరియార్ బలవంతంగా డబ్బులు తీసుకునేందుకు సిద్ధిక్ జేబులో చేయి వేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సిద్దిక్.. షాహెరియార్ చంపేస్తే అసలు రూ.500 ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించాడు. ఈ క్రమంలో షాహెరియార్ గొంతు నులిమి హత్య చేశాడు.
ఈ ఘటనపై మొదటి షాహెరియార్ మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు రాగ.. పోలీసుల దర్యాప్తు హత్యగా తేలింది. నిందితుడు 02.09.2023న అరెస్టు చేసి, 29.09.2023 న కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. ఇక సుదీర్ఘ విచారణ అనంతరం అదనపు జిల్లా న్యాయమూర్తి ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించారు. నిందితుడు మహ్మద్ సిద్దిక్ ఉల్లఖాన్ జీవిత ఖైదు, రూ.2000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. చట్టపరంగా నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన న్యాయ, పోలీస్ శాఖ అధికారులను జిల్లా ఎస్పీడి. జానకి అభినందించారు. ప్రజలకు నమ్మకాన్ని కలిగించే ఈ తీర్పు జిల్లా పోలీస్ శాఖ విధేయతకు నిదర్శనంగా నిలిచిందని ఆమె చెప్పారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025