బాలికల వసతి గృహంలో ఆగంతకుడు కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది ఈ ఘటన. అర్థరాత్రి ఓ ఆగంతకుడు ఆశ్రమ పాఠశాల గోడ దూకి ప్రవేశించడం సంచలనం సృష్టించింది. అగంతకుడు వసతి గృహంలోని కరెంట్ మెయిన్ ఆఫ్ చేసి బాలికల రూమ్‌లోని దూరాడు. బాలికల దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని గమనించి ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. దీంతో అగంతకుడు పరారయ్యాడు.
బాలికలు అర్ధరాత్రి తమ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఉదయమే బాలికల తల్లిదండ్రులు పాఠశాల హాస్టల్‌కు వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు ప్రయత్నించారు. బాలికల పాఠశాలలలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత రాద్ధాంతం జరగడంతో ఎట్టకేలకు హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
Also read
- లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!
- సాహితీవేత్తా దుర్గాప్రసాద్ ఉగాది పురస్కారం ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- Watch Video: ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సైరన్ మోగడంతో పరార్! ఎక్కడంటే..
- ఆరుగురు మహిళలు.. ధూమ్ సినిమా రేంజ్లో ప్లాన్.. చివరకు జరిగిందిదే..





