ఆకర్షణ ఎంతవరకైనా తీసుకెళ్తుంది.. కోరిక ఎంత పనైనా చేయిస్తుంది. అలాంటి కథే జగిత్యాల జిల్లా వెంకటేశ్‌ది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా తరహాలోనే.. ఈ వెంకటేశూ చేసిన పని తమ సొంత ఊళ్లో ఇప్పుడు వివాదాన్ని రేపుతోంది. రీల్ లైఫ్ ను తలపిస్తున్న ఆ రియల్ స్టోరీ ఏంటో తెలియాలంటే పూర్తి కథ చదవండి..
వెంకటేశ్, స్వప్న ఇద్దరిదీ జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామం. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్తా ఓ సినిమాను తలపించే ప్రేమ కథగా కొన్నేళ్లపాటు నడిచింది. పెద్దలు ఒప్పుకుంటారో, లేదోనన్న భయంతో వీరిద్దరూ రహస్యంగా 2015లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పొట్టకూటి కోసం ముంబై బాట పట్టిన కట్కూరి వెంకటేశ్… కొంతకాలం స్వప్నతో కలిసి ముంబైలో కాపురం చేశాడు. అదే సమయంలో ఓ పండంటి కొడుకు పుట్టాడు. అతడికి పేరు ప్రత్యేకంగా ఉండేలా మౌర్యన్ అని పెట్టుకున్నారు. స్వప్న, వెంకటేశ్ జంట కాపురం అన్యోన్యంగా సాగిపోతున్న క్రమంలో వెంకటేశ్ కు మరో యువతితో ముంబైలో పరిచయం ఏర్పడింది.
దాంతో వెంకటేశ్ స్వప్నను ఎలాగైనా సొంత గ్రామం కల్లెడకు పంపించి.. కొత్తగా బుట్టలో పడ్డ యువతితో ప్రేమయాణం నడపాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టుగానే స్వప్నకు ఏవో మాయమాటలు చెప్పి కల్లెడకు పంపించాడు. అప్పుడప్పుడూ వచ్చిపోతూ స్వప్నకు, కొడకుకు కావల్సిన సౌకర్యాలు తీరుస్తూ తిరిగి వెళ్లిపోయేవాడు. అయితే, వెంకటేశ్ ముంబైలో పరిచయమైన మరో యువతితో సాగించిన ప్రేమాయాణం కూడా పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితులను తెచ్చింది. దాంతో అక్కడ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే.. రీల్ కథ తరహాలోనే.. కల్లెడ వెంకటేశ్ కథ రక్తి కట్టింది. స్వప్నకు అనుమానం రావడంతో పెద్దల పంచాయితీ వరకూ వెంకటేశ్, స్వప్న కుటుంబ వివాదం వెళ్లింది. కుల పెద్ద మనుషుల తీర్మానం మేరకు స్వప్నను మళ్లీ ముంబై తీసుకెళ్తానని చెప్పాడే తప్ప వెంకటేశ్ ఆ పని చేయలేదు. దాంతో స్వప్నకు మరింత అనుమానాలు మొదలై.. ఆరా తీస్తే వెంకటేశ్ కు మరో పెళ్లైనట్టు తేలింది.
దీంతో స్వప్న కల్లెడలో వెంకటేశ్ ఇంటి ముందు తన కొడుకు మౌర్యన్ తో కలిసి న్యాయపోరాటానికి దిగింది. దీంతో జగిత్యాల రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. స్వప్నకు సర్దిచెప్పి.. ఆమెను జగిత్యాల పీఎస్ కు తీసుకెళ్లి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్ తో సహా, అతడికి సహకరించిన వారిపై మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also read
- భార్యాభర్తల సెల్ఫీ వీడియో – ఆపై సూసైడ్ – భార్యాభర్తలిద్దరూ మృతి… వీడియో
- కురిక్యాల పాఠశాల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం!
- Jangaon District :విద్యర్థులందరు భోజనం చేశాక సాంబార్లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన
- సినిమా రేంజ్ ట్విస్ట్.. భార్యను ఇంటికి పంపించి.. గుట్టుగా ఆ పని చేశాడు.. కట్ చేస్తే సీన్ ఇది
- Telangana: అంత చిన్న విషయానికే.. ఇంత దారుణమా.. అసలు ఏం జరిగిందంటే?





