కల్వకుర్తిలో పోలీసులను కళ్లుగప్పి ఓ అంతరాష్ట్ర దొంగ పరారయ్యాడు. వారం రోజులైనప్పటికీ ఆచూకీ లేకపోవడంతో సంబంధిత సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన మల్లెపూల నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగ.
పోలీసుల కళ్లుగప్పి ఓ అంతరాష్ట్ర దొంగ, రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. వారం రోజులైనరా ఆచూకీ లభించకపోవడంతో సంబంధిత ఖాకీలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అంతరాష్ట్ర దొంగ. ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా జైలులో ఖైదీగా ఉన్నాడు. అయితే వివిధ చోరి కేసుల విచారణ నిమిత్తం అంతరాష్ట్ర దొంగ, రిమాండ్ ఖైదీ మల్లెపూల నాగిరెడ్డిని ఈ నెల 11న నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో 13వ తేదీన రాత్రి పీఎస్ నుంచి దొంగ నాగిరెడ్డి ఎస్కేప్ అయ్యాడు. వాష్ రూమ్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన నాగిరెడ్డి ఎంతకు బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా వెంటిలేటర్ అద్దాలను ను ధ్వంసం చేసి అందులోనుంచి పరారయ్యాడు. దీంతో అదే రోజు రాత్రి కల్వకుర్తి పట్టణంలోని బస్ స్టాండ్, ఇతర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. విషయం ఉన్నతాధికారులకు చెప్పడంతో మరునాడు నుంచి అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. కల్వకుర్తి వన్ టౌన్ ఎస్సై మాధవ రెడ్డికి చార్జ్ మెమో ఇవ్వడంతో పాటు… హెడ్ కానిస్టేబుల్ నిరంజన్ నాయక్, కానిస్టేబుల్ లాల్ సింగ్ నాయక్‌లను సస్పెండ్ చేశారు. మరో హోంగార్డు లక్ష్మణ్‌ను వనపర్తి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు
Also Read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
- ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్‌కు తీసుకెళ్లి..





