హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు నా బ్యాగ్రౌండ్ తెలుసు అని బెదిరిస్తున్నారు. మరికొందరు చనిపోతామని రోడ్డు మీద పడుకుంటున్నారు. ఇంకొందరు ఇంట్లో తెలిస్తే గోల అవుతుందని పోలీసుల ముందు బోరున ఏడ్చేస్తున్నారు. అంతేకాదు.. ఏకంగా బ్రీత్ అనలైజర్ మీషన్లు ఎత్తుకుపోయిన మహానుభావులు కూడా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో తాగుబోతు వీరంగం సృష్టించాడు. చౌరస్తా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఈ సమయంలో మద్యం మత్తులో ఆటో నడుపుతున్న డ్రైవర్‌ను ఆపారు.
దీంతో అతను రెచ్చిపోయాడు. ఏకంగా ఆటోలో నుంచి పామును తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించేందుకు యత్నించాడు. దీంతో భయపడ్డ పోలీసులు అతడి నుంచి పక్కకు జరిగారు. కొద్దిసేపటి తర్వాత ధైర్యం తెచ్చుకుని.. జాగ్రత్తగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాముతో పోలీసులను బెదిరించిన కేసులో అతడిని అరెస్ట్ చేశారు
Also Read
- చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
- పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!





