SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతికి వేధింపులు… పాల్పడింది ఎవరో తెలిస్తే షాక్…..!



హైదరాబాద్‌లో ఓ ఖాకీ దారితప్పాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉండాల్సిన ఏఆర్ కానిస్టేబుల్‌ ఓ యువతిని బహిరంగంగా వేధించిన ఘటన కలకలం రేపుతోంది. ప్రెండ్లీ పోలీసింగ్‌ పేరును చెడగొట్టే ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ..


హైదరాబాద్‌లో ఓ ఖాకీ దారితప్పాడు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్.. ఓ యువతిని బహిరంగంగా వేధించాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెనుక నుంచి బైక్‌పై వచ్చి కానిస్టేబుల్ ఉద్దేశపూర్వకంగా తాకినట్లు బాధితురాలు ఆరోపించింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆమె తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న మధురానగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు ఏఆర్‌ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో యువతి చేసిన ఆరోపణల్లో నిజం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ఘటనపై కేసు నమోదు చేసి మధురానగర్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్ ప్రవర్తనపై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

సాధారణ ప్రజలకు రక్షణ చిహ్నాలైన పోలీసులు ఇలాంటి ఘటనల్లో నిందితులుగా మారడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్నవారే ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎవరిని నమ్మాలంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రెండ్లీ పోలీసింగ్‌కు మారు పేరుగా చెప్పే హైదరాబాద్ పోలీస్ శాఖకు ఇలాంటి కొందరి ప్రవర్తన కారణంగా చెడ్డపేరు వస్తుంది

Also Read

Related posts