RKT apartments పై నుండి కోడి గుడ్లు, రాళ్లు కొట్టారని హిందు సంఘాలు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య. టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదనపు బలగాలు భారీగా మోహరించారు. తప్పు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డిసిపి చెప్పడంతో రెండు వర్గాలు..
హైదరాబాద్, అక్టోబర్ 5: చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ బాగ్ దుర్గ మాతా నిమ్మార్జనంలో ఉద్రిక్తత నెలకొంది. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ బాగ్ పల్టన్ చౌరస్తా లో అమ్మవారి నవరాత్రుల పూజల తర్వాత అమ్మవారి నిమర్జనానికి ఊరేగింపుగా వెళుతున్న సమయంలో ఒక అపార్ట్మెంట్ పైనుంచి కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారన్న అంశంపై శనివారం అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగింది. సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉండే ఒక వర్గం భారీగా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఐదు జోన్ల డీసీపీలు స్పాట్‌కు చేరుకున్నారు. మరోపక్క శాంతిభద్రతలు అదుపు తప్పకుండా టాస్క్‌ఫోర్స్ ను రంగంలోకి దింపారు. ఇక కోడిగుడ్లు, టమాటాల శాంపిల్స్ సేకరించడానికి క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలను సేకరించింది. ఐతే ఘటన ఎలా జరిగింది? దీని వెనకాల ఉద్దేశం ఏంటి ఎవరు చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
RKT apartments పై నుండి కోడి గుడ్లు, రాళ్లు కొట్టారని హిందు సంఘాలు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య. టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదనపు బలగాలు భారీగా మోహరించారు. తప్పు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డిసిపి చెప్పడంతో రెండు వర్గాలు వెనక్కి తగ్గాయి. మరోవైపు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు క్లూస్ టీం సేకరించాయి. సౌత్ జోన్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సెంట్రల్ జోన్ల డిసిపి ల ఆధ్వర్యంలో భారీగా మోహరించిన పోలీసులు. లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు టాస్క్ పాస్ పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
సంఘటనపై పూర్తి విచారణ చేయాలని ఫిర్యాదు చేసిన మండప నిర్వహకులు. కోడిగుడ్లు టమాటాలు విసిరేసిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీస్ అధికారులు ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. దీనిపై చైతన్య,సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి మాట్లాడుతూ.. సంఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు స్పాట్ కి చేరుకున్నాయి. వాస్తవానికి సంఘటన జరిగిన సమయంలో అక్కడే పోలీసులు ఉండటంతో విషయం పెద్దది కాకుండా ఆపగలిగాం. కోడిగుడ్లు టమాటాలు విసిరేసారని ఒక వర్గం ఆరోపణలు చేస్తోంది దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేశాం. సంఘటన ఎలా జరిగింది అనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నాము. క్లూస్టిన్ రంగంలోకి దిగి శాంపిల్స్ సేకరించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. జరిగిన సంఘటనపై ప్రస్తుతం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని అన్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!