SGSTV NEWS online
CrimeTelangana

Telangana: చదువు పేరుతో విదేశాల నుంచి.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..




హైదరాబాద్‌లో విదేశీ వ్యభిచార రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చిన ఓ విదేశీయుడు కెన్యా, ఉగాండా దేశాల మహిళలతో ఈ దందా నడుపుతున్నాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు ఐదుగురు విదేశీ మహిళలను అరెస్ట్ చేశారు.

దేశంలో చదువుకోవడానికి స్టూడెంట్ వీసాపై వచ్చి.. ఇక్కడ వ్యభిచార రాకెట్‌ను గుట్టుగా నడుపుతున్న విదేశీ ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడితో సహా ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు.

ఈ రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డేరియస్ 2021లోనే స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, స్థానికంగా ఒక కాలేజీలో ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఇతడు కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో వ్యభిచార దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఐదుగురి అరెస్ట్.. రెస్క్యూ హోమ్‌కు మహిళలు
దాడి సందర్భంగా ప్రధాన నిందితుడు డేరియస్‌తో పాటు మరో నలుగురు విదేశీ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించగా, ప్రధాన నిందితుడైన డేరియస్‌ను రిమాండ్‌కు పంపారు. ఈ ముఠాకు స్థానికంగా ఎవరు సహకరిస్తున్నారు..? వీరి వెనుక ఇంకా ఎవరైనా పెద్ద నెట్‌వర్క్ ఉందా? అనే కోణంలో మియాపూర్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు

Also Read

Related posts