మద్యం మత్తులో మనుషులు చేసే పనులు ఎక్కడికి దారితీస్తాయో అర్థం కావడం లేదు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట పాలిటెక్నిక్ హాస్టల్ వాచ్‌మెన్ నరేష్ తాగిన మైకంలో విద్యార్థుల కోసం ఉంచిన అన్నం గిన్నెలో కాలు పెట్టి పడుకున్నాడు. ..
మద్యం మత్తులో కొంతమంది చేసే పనులు చూస్తే ఒళ్లంతా కంపరం పుడుతుంది. మితిమీరి తాగిన మత్తులో కొందరు పిచ్చోళ్లలా ప్రవర్తిస్తున్నారు. తాగిన మైకంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి.. మత్తు దిగిన తర్వాత పశ్చాత్తాప పడటం కొందరికి అలవాటుగా మారిపోయింది. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన పనికి తన ఉద్యోగం పోయింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్లో వాచ్ మెన్ చేసిన నిర్వాకం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వాచ్ మెన్ ఫుల్లుగా మద్యం తాగి విద్యార్థులకు వడ్డించే అన్నం గిన్నెలో కాలు పెట్టి సోయి లేకుండా పడుకున్నాడు. తినడానికి వచ్చిన స్టూడెంట్స్ ఈ సీన్ చూసి షాక్‌కి గురయ్యారు.
అన్నం గిన్నెలో కాలు పెట్టి పడుకున్న వాచ్ మెన్ నరేష్ వీడియో తీసి కాలేజీ ఉన్నతాధికారులు పంపించారు విద్యార్థులు. ఆ వీడియో చూసిన అధికారులు వెంటనే నరేష్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో, అతడ్ని విధులనుంచి..ఇలా కాలేజీకి మద్యం తాగి రావడమే తప్పు అంటే.. ఇంకా సోయి లేకుండా విద్యార్థుల కోసం వండిన అన్నంలో కాలు పెట్టి పడుకోవడంపై అధికారులు ఫుల్ సీరియస్ అయ్యారు. ఇలా మద్యం మత్తులో చేసిన పనులకు, మత్తు దిగినాక అసలు విషయం తెలుసుకొని ఎంత బాధపడిన ప్రయోజనం శాన్యమే. ఇప్పుడు నరేష్ వీడియో సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అవుతుంది.
Also Read
- గుంటూరు: హాస్టల్లో అమ్మాయి బ్యాగ్ చెక్ చేసిన సిబ్బంది.. కనిపించింది చూసి అవాక్కు
- మంగళవారం అప్పు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదంటారు? ఎందుకు?
- Astrology Tips: లక్ష్మీదేవి సంకేతం! బంగారం దొరికితే ఏమవుతుందో తెలుసా?
- నేటి జాతకములు..15 నవంబర్, 2025
- ఒకే ప్లేస్‌కి రెండో సారి చోరీకి వచ్చిన దొంగలు..! ఫస్ట్ టైమ్ సక్సెస్ కానీ, రెండో సారి మాత్రం..





