దక్షిణ ఢిల్లీలోని సత్బరి గ్రామం నుంచి గుట్టుగా వర్క్ అవుతున్న అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. హై-టెక్నికల్ సెటప్‌తో రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో నడిపిస్తున్న ఈ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ ఢిల్లీలోని సత్బరి గ్రామం నుంచి పనిచేస్తున్న అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. VoIP ఆధారిత కాలింగ్ సెటప్‌లు, విదేశీ డేటాబేస్‌లు, నకిలీ కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగించి విదేశీయులను లక్ష్యంగా చేసుకుని నివాస భవనం నుంచి పెద్ద ఎత్తున నడిపిస్తున్న ఈ ఫేక్ కాల్ సెంటర్‌ను పోలీసులు సీజ్ చేయడంతో పాటు ఒక మహిళతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ రాకెట్‌ను సాను అనే వ్యక్తి నడుపుతున్నాడని, అతడు గతంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వాంటెడ్ క్రిమినల్ అని తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాల్ సెంటర్ నడుపుతున్న ఆ బిల్డింగ్ సాను తమ్ముడు రెహాన్ అలియాస్ టిన్నీ పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ భవనాన్ని సీజ్ చేయడంతో పాటు సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బహుళ కంప్యూటర్ సిస్టమ్‌లు, మొబైల్ ఫోన్‌లు, VoIP సాఫ్ట్‌వేర్, విదేశీ డేటా సెట్‌లు ఇందులో ఉన్నాయి. అంతర్జాతీయ కస్టమర్ సపోర్ట్ కాల్ సెంటర్ మాదిరిగానే మొత్తం సెటప్ రూపొందించారని పోలీసులు తెలిపారు.
అంతకుముందు నవంబర్ 10న క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో వరుసగా దాడులు నిర్వహించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నవారిని అణిచి వేసింది. అరెస్టయిన వారిలో కురుక్షేత్రకు చెందిన సుమిత్ కుమార్, అతుల్ శర్మ, హిసార్‌కు చెందిన రాహుల్ మందా, జలంధర్‌కు చెందిన వరుణ్ అంచల్ అలియాస్ లక్కీ, సరన్‌కు చెందిన అమిత్ కుమార్ సింగ్ అలియాస్ కార్తీక్‌లు ఉండగా.. వారందరినీ వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశారు. కాగా, బాధితులను డిజిటల్ అరెస్ట్‌కు లొంగిపోయేలా బెదిరించడానికి స్కామర్లు నకిలీ పోలీసు, ఏజెన్సీ గుర్తింపు కార్డులను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు తేల్చారు
Also Read
- మార్గశిర మాసం.. ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేస్తే.. ఇంట్లో కనక వర్షం కురిసినట్టే..
- నేటి జాతకములు…22 నవంబర్, 2025
- అలసిపోయాను.. చావడానికి అనుమతి ఇవ్వండి.. సుప్రీంకోర్టు, పీఎంవోకు లేఖ!
- Hyderabad: 24 గంటల్లో డెలివరీ.. హాస్పిటల్‌కు వచ్చిన గర్భిణి మిస్సింగ్.. ఇక్కడే అసలు ట్విస్ట్
- హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్టులో ఇరుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!





