SGSTV NEWS online
CrimeTelangana

గుండె పగిలే విషాదం.. గుడిలో అన్నదానం చేస్తుండగా ఊహించని ఘటన..



జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో అన్నదానం చేస్తుండగా 3వ తరగతి చదువుతున్న నిశాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రస్తుత కాలంలో గుండె పోటు కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, యువతలో కూడా గుండెపోటు, గుండె సమస్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా.. ఓ చిన్నారి గుండెపోటుతో చనిపోవడం కలకలం రేపింది.  ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో జరిగింది. 3వ తరగతి చదువుతున్న తోపారపు నిశాంత్ అనే చిన్నారి గుండెపోటుతో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వ్యవసాయ పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదానం కార్యక్రమం జరుగుతుండగా, నిశాంత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వారు వెంటనే అప్రమత్తమై బాలుడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలోనే నిశాంత్ ప్రాణాలు కోల్పోయాడు.

నిశాంత్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, నవితలకు అతడు ఒక్కగానొక్క కుమారుడు. కుమారుడి ఆకస్మిక మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు గ్రామస్థుల హృదయాలను కదిలిస్తున్నాయి. నిశాంత్ తండ్రి చంద్రశేఖర్ జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

చిన్న వయసులో గుండెపోటు వచ్చి బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో గుండెపోటుతో పెద్దలతోపాటు.. చిన్న పిల్లలు కూడా మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also read

Related posts