SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: బొల్లారం రైల్వేస్టేషన్ దగ్గర రెండు రోజులుగా ఆగిన కారు.. లోపల ఏముందా అని చూడగా



అది బొల్లారం ఏరియా.. ఓ అనుమానాస్పద కారు రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పటి నుంచో ఆగి ఉంది. గంటలు గడుస్తున్నా అక్కడ నుంచి కదలలేదు. అనుమానమొచ్చిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు ఎంటర్ అవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. కేటుగాళ్లు దొంగదారిలో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. అమాయకులను ఈ కూపంలోకి లాగుతూ.. తమ దందాను కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే జరుగుతున్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఘటన ప్రస్తుతం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మరి ఆ వివరాలు ఏంటి.?

హైదరాబాద్‌లోని బొల్లారంలో గంజాయి కలకలం సృష్టించింది. స్థానిక బొల్లారం బజారు రైల్వేస్టేషన్ సమీపంలో ధూళిపేట్‌కు చెందిన పూజాబాయి, సోను అనే ఇద్దరు ఓ కారులో యదేచ్చగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్‌బీ ఎస్సై బాలరాజు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. నిందితులు ఇద్దరినీ పట్టుకోవడంతో పాటు వారి దగ్గర నుంచి 7.043 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకోవడం, కారు, మొబైల్స్‌ను సీజ్ చేశారు. వీరు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి 10 కేజీల గంజాయిని తీసుకువచ్చి.. ఇక్కడ అమ్మకాలు చేపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమారు మూడు కిలోల మేర అమ్మకాలు జరపగా.. మిగిలిన 7.043 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూజాబాయి, ఆమె భర్త ఆకాష్ సింగ్‌తో పాటు సత్యంరావు అలియాస్ సోనులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై నిందితులను, గంజాయిని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించామని ఎస్సై బాలరాజు తెలిపారు.

Also Read

Related posts