SGSTV NEWS
CrimeNational

దారుణం: మధ్యప్రదేశ్‌లో బురారీ తరహా మరణాలు.. అచ్చం ఓకే తరహాలో!

ఢిల్లీలోని బురారీలో ఓ కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన 2018లో తీవ్ర సంచలనం రేపింది. ఒక్కరు మినహా మిగిలిన వారంతా ఉరి వేసుకున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌లో ఓ సంఘటన వెలుగు చూసింది.

Also read :భార్య చనిపోయింది అనుకుని అంత్యక్రియలు కూడా చేశాడు! కానీ., 53 రోజుల తరువాత!

2018లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఢిల్లీలోని బురారీలో ఆత్మహత్యల ఘటన. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు అనుమానాస్పద రీతిలో మరణించారు. తమ ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. అత్యంత ఘోరమైన స్థితిలో ఆ మృతదేహాలు ఉన్నాయి. వృద్దురాలు ఓ గదిలో హత్య చేయబడి కనిపించింది. ఈ వార్త అప్పట్లో పెను సంచలనం అయ్యింది. ఇప్పటికీ ఆ మరణాల వెనుక స్పష్టమైన కారణాలు తెలియలేదు. క్షుద్ర పూజలు జరిగాయన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు ఇదే తరహాలో ఇప్పుడు మరో సంఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబంలోని ఐదుగురు ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించారు. ఇందులో చిన్నారులు కూడా ఉండటం విషాదకరం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Also

బురారీ, మధ్యప్రదేశ్ ఘటనల్లో విస్తుపోయే విషయాలు దాగి ఉన్నాయి. ఈ రెండు ఘటనలు ఒకే రోజు.. ఒకే తరహాలో జరగడం గమనార్హం. బురారీ ఘటన 2018 జులై 1న జరగ్గా.. మధ్యప్రదేశ్ ఘటన 2024 జులై 1న చోటుచేసుకోవడం విషాదకరం. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలోని రవ్డి గ్రామంలోని ఓ రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలచి వేసింది. మృతులు రాకేష్ దొడ్వా (27), అతని భార్య లలితా దొడ్వా (25), వారి పిల్లలు లక్ష్మీ (9), ప్రకాష్ (7), అక్షయ్ (5)గా గుర్తించారు. కాగా, మృతులంతా ఉరికొయ్యకు వేలాడుతుండగా.. కుమార్తె లక్ష్మీ విగతజీవిగా నేలపై పడి కనిపించింది. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Also read,:భార్యను కత్తితో పొడిచిన కానిస్టేబుల్
అయితే ఇది ఆత్మహత్య అని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అలీరాజ్‌పూర్‌లోని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) నేతృత్వంలోని బృందం ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. రైతు అయిన రాకేష్ దోడ్వా.. గతంలో గుజరాత్‌లో తాపీ మేస్త్రీగా కూడా పనిచేశాడు. అయితే ఆర్థిక సమస్యలా, మరే ఇతర కారణాలో తెలియరాలేదు. డాగ్ స్క్వాడ్ మరియు ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలం నుండి ఫింగర్ ఫ్రింట్స్ సేకరించింది. అయితే ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ అయ్యిందని, దర్యాప్తు కొనసాగిస్తునట్లు వెల్లడించారు. గతంలో కూడా ఇదే తరహాలు పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది గుజరాత్ లో ఓకే కుటుంబంలో ఏడుగురు, 2022లో మహారాష్ట్రలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు

Also read :Crime News: యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య

Related posts

Share this