March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime News: భార్యను హతమార్చి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్



గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. అనుమానంతో భార్య శ్రావణిని హత్య చేసిన భర్త సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సురేష్ ఆరు నెలల క్రితం రేవేంద్రపాడుకు మకాం మార్చాడు. ఈ క్రమంలో బుధవారం భార్య శ్రావణిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via