June 29, 2024
SGSTV NEWS
CrimeNational

లగ్జరీ లైఫ్ గడిపిన పవిత్ర గౌడ్.. ఇప్పుడు జైల్లో నిద్ర పట్టక!

రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటికే ఏ1 నిందితురాలిగా పవిత్ర గౌడ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితురాలైనా పవిత్ర ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవిస్తుంది. అయితే ఇన్నాళ్లు లగ్జరీ లైఫ్ ను అనుభవించిన పవిత్ర జైలు లో ఇప్పుడు ఎలాంటి జీవితం అనుభవిస్తుందో ప్రస్తుతం సమాచారం అందింది.

కన్నడ నటి పవిత్ర గౌడ్.. గత కొన్ని రోజులుగా ఈ పేరు వార్తలో మారు మోగిపోతున్న విషయం తెలిసిందే. కాగా, కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రేయసి అయినా పవిత్రా గౌడ్.. దర్శన్ అభిమాని అయినా రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటికే ఏ1 నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఏ2 నిందుతిడుడిగా దర్శన్ ఉన్నాడు. ఇక అసభ్యకరమైన మెసేజ్ లు చేశాడంటూ.. రేణుకస్వామిని అత్యంత దారుణంగా కొట్టి హత్య చేయడం అనేది కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర కలకరం రేపింది. ముఖ్యంగా ఈ కేసులో కన్నడ పరిశ్రమ నుంచి పలువురు నటులు సైతం స్పందించి తప్పు చేసివాళ్లకి శిక్షపడాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో.. పవిత్ర, దర్శన్ తో పాటు మరో 15 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో ప్రధాన నిందుతురాలిగా పవిత్ర గౌడ్ ఉంది.

ఇకపోతే గురువారం నాడు పవిత్రను పరప్పన అగ్రహారం కారాగారానికి తరలించారు. అంతేకాకుండా ఆమెకు ఖైదీ నెంబర్ 6024ని కూడా అధికారులు కేటాయించారు. అయితే ఎంతో విలాసవంతంగా లగ్జరీ లైఫ్ ను అనుభవించిన పవిత్ర జైలు లో ఒంటరి జీవితం అనుభవిస్తుంది. ముఖ్యంగా జైలు లో ఆమె ఓ చిన్న గదిలో ఉంటూ.. చాలా మానసిక వేదననకి గురవుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట అయితే పూర్తిగా నిద్ర పోవడం లేదనీ, పడుకున్న కళ్లు మూతలు పడకపోవడంతో.. ఆ చిన్న గదిలోనే అటూ ఇటూ తిరుగుతుందని సమాచారం. అలాగే శుక్రవారం తెల్లవారు జామున పవిత్ర ఐదు గంటలకే లేచి పరిసరాల్లో వాకింగ్ చేస్తుందట. ఆ తర్వాత టిఫెన్ చేసి కాఫీ తీసుకుంటుదట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవిత్రతో పాటు మరో తొమ్మిది మందిని ఏసీఎంఎం న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీకి అప్ప‌గించింది.

అలాగే ఈ కేసులో రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రేణుకస్వామి హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో ఏ2గా ఉన్నా దర్శన్ ఉండగా.. మళ్లీ ఇప్పుడు ఆయన భార్య విజయలక్షి కూడా ఈ హత్య గురించి ముందే తెలియడంతో ఆమెకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో అధికారులు 39కి పైగా సాక్ష్యాల‌ను సేక‌రించారు. పైగా ఈ సంఘ‌ట‌న‌తో నేరుగా సంబంధం లేక‌పోయినా నిందుత‌ల‌కు కొంద‌రు స‌హాయ‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించారు. అలాగే సాక్ష్యాధారాల‌ను నాశనం చేసేందుకు ర‌స‌హ్య‌సంగా స‌హ‌క‌రించార‌ని అధికారులు ఎవరెవరు అనేది తెలుసుకోవడంతో పాటు దర్శన్ తో పాటు మరో ముగ్గుర్నీ కూడా విచారిస్తున్నారు. ఇక మరోపక్క అటవీశాఖ అధికారులు కూడా భార్య భర్తలిద్దరిపై మరో కేసులో నోటిసులు ఇచ్చిన సంగతి తెలిందే. మరి, ప్రస్తుతం పవిత్ర గౌడ్ జైలులో గడుపుతున్న పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Related posts

Share via