108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి.. ఇక్కడ దేశం నలమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా విదేశీ భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇదే ఆలయంలోని అత్తి వరదరాజ పెరుమాళ్ స్వామి 40 ఏళ్లకోసారి భక్తులకు దర్శనమిస్తుంటారు.. 2019లో 40 రోజులపాటు భక్తులకు దర్శనం అవకాశం దొరికింది. మళ్లీ 2059లో అతి వరదరాజ స్వామి ఆలయ మూలవిరాట్ తలుపులు తెరుచుకోనున్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆలయంలో బంగారం, వెండి మాయం అయిన ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇటీవల కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా బంగారం తాపడం మాయమైన ఘటన వివాదం అవ్వడంతో.. ఆ ఘటనపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.. అయ్యప్ప సన్నిధిలో ఉన్న ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం బంగారం కరిగించేసి మాయం చేశారన్న ఆరోపణ రావడంతో అక్కడ విచారణ జరుగుతుంది. ఇప్పుడు కంచిలోనే వరదరాజ పెరుమాళ్ ఆలయంలో స్వామివారి దర్శనం తర్వాత అత్యంత ముఖ్యమైన బంగారు వెండి బల్లుల దర్శనం అనేది ఇక్కడ ప్రధానం. బంగారు వెండి తో చేసిన తాపడాలని విగ్రహాలకు కవచంగా చేసి దశాబ్దాలుగా దర్శనం అనేది భక్తులకు కల్పిస్తున్నారు. వందలకు పైగా ఆలయానికి వచ్చిన భక్తులు ఎక్కడ ఉన్న బంగారు బల్లి, వెండి బల్లిని దర్శించుకోకుండా బయటికి వెళ్లరు.
ఇటీవల వాటి మరమ్మతుల పేరుతో తాపడాలను తీసి వాటి స్థానంలో పూత పూసిన నాసిరకం నకిలీ తాపడాలని వాటి స్థానంలో ఉంచినట్లు అనుమానం రావడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.. వందేళ్ళకు భయపడిన పురాతనమైన బంగారం కావడంతో ఆ బంగారానికి మార్కెట్లో మంచి విలువ ఉంటుంది. ఒక మార్కెట్లో ఉన్న బంగారం కంటే నాణ్యత పరంగా ఆ బంగారం విలువ ఎక్కువగా ఉంటుంది.. అంతేకాకుండా ఆలయంలో దశాబ్దాలుగా నిత్య కైంకర్యాలు జరిగే ఆలయంలోని బంగారానికి ఆ లోహాలకు విశేషమైన శక్తి ఉంటుందని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు.
అలాంటి బంగారం మార్కెట్ విలువ కంటే పదింతలు ఎక్కువగా వెచ్చించి కొనుగోలు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు.. అలాంటి వారి కోసమే ఈ బంగారం అక్కడి నుంచి మాయం చేసి ఆ స్థానాల్లో బంగారం పూత పూసిన కవచాలను అక్కడ ఉంచారన్న అభియోగం ఉంది. తమిళనాడులో విగ్రహాల చోరీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. ఆ విభాగం డిసిపి సంపత్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది.
ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో బాగా అరిగిన బంగారం, వెండి బల్లులు విగ్రహాలను 6 నెలల క్రితం మరమ్మతు పనులు చేపట్టినట్లు ఆలయ అధికారులు విచారణ అధికారులకు తెలిపారు.. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్న డిసిపి సంపత్ ఆలయ అదనపు ఈవో జయలక్ష్మి తో పాటు ఆలయంలోని అర్చకులు ముఖ్య అధికారులందరినీ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు..
తమిళనాడు దేవాదాయ శాఖ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రెండు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని విచారణ అధికారిని ఆదేశించింది. తమిళనాడులోని పలు ఆలయాల్లో నిత్యం ఇలా సంపద విషయంలో వివాదాలు జరుగుతుండడం.. ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది
Also Read
- అక్క కొడుకుని కాపాడే ప్రయత్నం.. అంతలోనే ముంచుకొచ్చిన మృత్యువు!
- Andhra: సర్.! ఆఫీస్‌పై ఏసీబీ రైడ్స్ అంట.. ఫోన్ కాల్ రాగానే దడుసుకున్నాడు.. కట్ చేస్తే
- గుంటూరు: హాస్టల్లో అమ్మాయి బ్యాగ్ చెక్ చేసిన సిబ్బంది.. కనిపించింది చూసి అవాక్కు
- మంగళవారం అప్పు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదంటారు? ఎందుకు?
- Astrology Tips: లక్ష్మీదేవి సంకేతం! బంగారం దొరికితే ఏమవుతుందో తెలుసా?





