ఢిల్లీ ఎర్రకోట దగ్గర రన్నింగ్ కారులో బాంబు పేలిన ఘటనలో మృతుల సంఖ్యపెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట దగ్గర రన్నింగ్ కారులో బాంబు పేలిన ఘటనలో మృతుల సంఖ్యపెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.. కారు పుల్వామాకు చెందిన డా.ఉమర్‌దిగా గుర్తించారు. నిన్న కారులో ఉన్నది డా.ఉమర్గా ప్రాథమికంగా నిర్ధారించారు. డా.ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తి .. అని.. శ్రీనగర్‌లోని MD మెడిసిన్స్ కాలేజీ, GMC అనంతనాగ్‌లో పనిచేసినట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అల్ఫాలా ఫరీదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.. గత నెలలో అమీర్ పేరుమీద వాహనాన్ని కొనుగోలు చేసిన డా.ఉమర్.. అదే వాహనాన్ని పేలుడుకోసం వాడినట్లు పేర్కొంటున్నారు.
పలువురు అరెస్ట్..
ఢిల్లీ కారు పేలుడు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అమీర్ రషీద్ మిర్ (27), ఉమర్ రషీద్ మిర్(30).. తారిఖ్ మాలిక్ (44) ను కశ్మీర్ వ్యాలీలో జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు మరో 13మంది అనుమానితులు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.
ఘటనా స్థలంలో రాత్రి నుంచి FSL అధికారుల తనిఖీలు చేపట్టారు. పేలుడుకు సంబంధించి పలు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బ్లాస్ట్ సైట్ దగ్గర నిందితుడి DNA నమూనాల సేకరించారు. రివర్స్‌లో కారు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బదర్పూర్ సరిహద్దు నుంచి ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు.. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కాశ్మీరీ గేట్- ఎర్రకోట వరకు CCTVల పరిశీలిస్తున్నారు. CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తున్న 200 మంది పోలీసు సిబ్బంది పలు కీలక వివరాలను సేకరించారు. సుమారు 13 మందిని అనుమానితులుగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ బ్లాస్ట్‌కు ఫరీదాబాద్, పుల్వామా లింకులు బయటపడుతున్నాయి.. డా.ఉమర్‌కు కారును అమ్మిన తారీఖ్ పుల్వామాలో అరెస్టు అయ్యాడు.. ఇటీవల ఫరీదాబాద్‌లో IEDలతో ఇద్దరు డాక్టర్లు పట్టుబడ్డారు.. వారి నుంచి 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అదే అమ్మోనియం నైట్రేట్‌తో కారు బ్లాస్ట్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఢిల్లీ బ్లాస్ట్ FSL ప్రాథమిక దర్యాప్తులో.. అమ్మోనియం నైట్రేట్ జాడలు గుర్తించడంతో ఈ రెండింటికి లింకు ఉన్నట్లు స్పష్టమవుతోంది..
కేసు నమోదు..
ఢిల్లీ కారు పేలుడు ఘటనపై FIR నమోదైంది. రెడ్‌ఫోర్ట్ పోలీస్ పోస్ట్ SI వినోద్ నయన్ స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. పేలుడు సమయంలో పోలీస్ పోస్టులోనే ఉన్న ఎస్సై వినోద్.. పేలుడు శబ్దం విన్న తర్వాత బయటికొచ్చి చూశారు. మంటల్లో తగలబడుతున్న వాహనాలు చూసినట్టు ఫిర్యాదు చేశారు.
Also read
- వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామనకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్!
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి





