June 29, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

భర్త కోసం ఎన్నో బాధలు భరించింది! కానీ.. చివరికి ఒకరోజు! ఇంత దారుణమా?




పెళ్లై నాలుగేళ్లు అయిపోతుంది. ఇంకా పిల్లలు లేరని భార్యను తిడుతుంటే భరించలేకపోయాడు భర్త. చివరకు భార్య కోసం ఆమెతో కలిసి ఎన్నో పూజలు చేశాడు. నోములు నోచాడు. ఏ దేవుడో కరుణించి.. ఓ బిడ్డను ప్రసాదించాడు. కానీ



ప్రియాంక, నీలేష్ భార్యా భర్తలు. పెళ్లై చాన్నాళ్ల పాటు పిల్లలు లేకపోవడంతో ఎన్నో పూజలు, వ్రతాలు నోచారు. సంతానం కలగాలని మొక్కని దేవుడే లేడు. చివరకు ఆ దేవుడు కరుణించి ఓ బిడ్డను ప్రసాదించాడు. బుజ్జాయి నవ్వులతో ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరిసింది. కొడుకు రాకతో అదృష్టవంతులు లేరని భావించారు. ఆనందంగా సాగిపోతున్న సంసారంలో కుదుపులు మొదలయ్యాయి. ఏ కొడుకు పుట్టాలని భావించాడో ఆ కొడుకునే కడతేర్చాడు కన్నతండ్రి. భార్యను కూడా హత్య చేసి.. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఓ చిన్న అలవాడు ముగ్గురు జీవితాలను చిదిమేసింది. మద్యానికి బానిసైన నీలేష్.. ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టాడు.


భార్యతో పాటు కొడుకును అత్యంత కిరాతకంగా హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నీలేష్, ప్రియాంక 2016లో వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక కొన్నాళ్లపాటు ఈ దంపతులకు పిల్లలు కలగలేదు. భార్యను గోడ్రాలు అంటే భరించలేకపోయాడు భర్త. పిల్లల కోసం భార్య పూజలు చేస్తే ఆమె వెంట వెళ్లేవాడు. ప్రియాంకకు అన్నింటిలో తోడు నీడగా ఉండేవాడు. చివరకు ఈ దేవుడి వరమే..పెళ్లైన నాలుగేళ్లకు అంటే 2020లో ఓ కుమారుడికి జన్మనిచ్చింది ప్రియాంక. బాబు రాకతో ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరిసింది. ఇంతలో నీలేష్ మద్యానికి బానిసై అయ్యాడు. తరచూ ఇంట్లో డబ్బులు అడిగేవాడు. దీంతో అతడి తండ్రి. .ఓ ఆటో కొని ఇచ్చి బతకమని చెప్పాడు.


Sandip University
కానీ ఆటో నడిపిన డబ్బులతో ఎక్కువ భాగం తాగడానికే ఖర్చు పెట్టేవాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. భార్య ప్రియాంక ప్రశ్నిస్తే.. ఆమెపై చేయి చేసుకునేవాడు. బెల్ట్ తీసుకుని పలుమార్లు కొట్టేవాడు. భర్త కావాలని ఆమె ఎన్నో బాధలు భరించింది.  అయినప్పటికీ ఆమెను కొడుతూనే ఉండేవాడు. చివరకు భరించలేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నీలేష్‌కు వార్నింగ్ ఇవ్వడంతో కొంత కాలం బాగానే ఉండేవాడు.  మళ్లీ పాత వైఖరికి వచ్చేశాడు. ఈ క్రమంలో ఇటీవల మద్యం సేవించి ఇంటికి వచ్చిన నీలేష్.. భార్యతో గొడవ పడ్డాడు. తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో భార్యను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కొడుకును కూడా హత్య చేశాడు. ఆపై అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. ముగ్గురు మృతదేహాలు కనిపించే సరికి ఒక్కసారిగా ఒళ్లు జలదరించడంతో పాటు నిశ్చేష్టులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కూతుర్ని, మనవడ్ని అలాంటి పరిస్థితిలో చూసి ఆమె కన్నవారు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.

Also read

Related posts

Share via