భర్త, అత్తంటివారి టార్చర్ భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో జరిగింది. పెళ్లి జరిగి ఐదు నెలలో కాగా వారి టార్చర్ భరించలేకపోయింది. కట్నం కింద ఇచ్చిన ఇంటిని అమ్మేసి డబ్బు తీసుకురావాలని తాగి వచ్చి కొట్టేవాడు. దీంతో ఆ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.
అత్తవారి కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండాలని కలలు కని ఎన్నో ఆశలతో అత్తింటికి వెళ్లిన నవవధువులు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి దారుణ ఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు గ్రామంలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి సచివాలయం ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య శ్రీ విద్య శ్రీ చైతన్య కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తుంది.
ఐదు నెలల కిందట వివాహం జరగ్గా..
ఈమెకు ఐదు నెలల కిందట వివాహం జరిగింది. తల్లిదండ్రులు ఈమె పెళ్లిని ఎంతో ఘనంగా చేశారు. పెళ్లి సమయంలో 10 లక్షల విలువ చేసే బంగారం, డబ్బు, రెండు అంతస్తుల ఇల్లు కట్నంగా ఇచ్చారు. అయితే కట్నం కింద తల్లిదండ్రులు ఇచ్చిన ఇంటిని అమ్మేయాలని శ్రీవిద్యపై ఆమె భర్త ఒత్తిడి తీసుకొచ్చాడు. డైలీ మద్యం సేవించి శ్రీ విద్యను హింసించాడు. ఆమె భర్తతో పాటు అత్తమామలు కూడా శ్రీ విద్యను వేధింపులకు గురిచేశారు. వీరికి పెళ్లి జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే జరిగింది. ఆమెను కుటుంబ సభ్యులు ఎవరూ మంచిగా చూసుకోకుండా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
సౌసైడ్ నోట్ రాసి..
దీంతో శ్రీవిద్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వారికి కొన్ని విషయాలు తెలిశాయి. భర్త అరుణ్ కుమార్ వల్ల ఆత్మహత్య చేసుకుంటా అనే ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. వీటికి సంబంధించిన ఫొటోలను పోలీసులు గుర్తించారు. ఫోన్ సీజ్ చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. అరుణ్ కుమార్, తల్లి, తండ్రి పై వరకట్న కేసు నమోదు చేశారు. ఎలాగైనా అరుణ్ కుమార్‌ను శిక్షించాలని సూసైడ్ నోట్‌లో ఆమె రాసింది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అరుణ్ కుమార్ వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉండటం వల్ల శ్రీ విద్యను హింసించినట్లు తెలుస్తోంది. అందంగా లేవని, అందుకే వేరే అమ్మాయిని చూసుకున్నాని భార్యను తీవ్రంగా వేధించాడు. కేవలం కుటుంబ కారణాల మీదనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025