October 16, 2024
SGSTV NEWS
CrimeNational

కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి! మన ప్రేమే వాళ్ళ పెట్టుబడి!

ఈ మధ్య సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. రోజుకొక కొత్త ఫ్లాన్స్ అమాయక ప్రజలను బెదిరిస్తూ, భయపడుతూ కొంతమంది సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. అయితే తాజాగా డ్రగ్స్ పేరిట మరో కొత్త సైబర్ నేరానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడంటే..

Also read :ఆమెని ప్రాణంగా ప్రేమించాడు! పెళ్ళైన తరువాత ఓ రాత్రి బయటకి పిలిచి!

ఈ మధ్య సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో కొంతమంది సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఫ్లాన్స్ చేస్తూ.. అమాయకపు ప్రజలకు మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు బ‍్యాంకు మెసేజ్‌లు, గిప్టులు, కూపన్లు, ఈ కేవైసీలు,కొరియర్‌ ఫార్శిల్స్‌, డ్రగ్స్ పార్శిల్, ఢీప్‌ ఫేక్‌ ఫోటోలు వంటి రకరకాల పేర్లతో.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు డ్రగ్స్ కేసుల పేరిట పెద్ద సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. తాజాాగా ఈ క్రమంలోనే ఓ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడంటే..

Also read :ఏపీలో మరో మూడు నెలలు ఆ బ్రాండ్‌లే అమ్మకం… కొత్త మద్యం పాలసీ వచ్చేది అప్పుడే…

తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఫోన్ కాల్ రూపంలో ఓ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల రూపంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఓ యువతికి ఫోన్ చేసి డ్రగ్స్ కేసులో మీ నాన్న ఇరుక్కున్నాడంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా.. డబ్బులు ఇవ్వకుంటే.. మీ నాన్న కాళ్లు, చేతులు నరికేసి జైలులో వేస్తామని హెచ్చరించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి సైబర్ క్రిమినల్స్ వాట్సాప్ కాల్ చేశారు. ఇక ఆ కాల్ పోలీస్ డీపీతో ఉన్న నెంబర్ కావడంతో వెంటనే ఆ యువతి లిఫ్ట్ చేసి మాట్లాడగా.. అవతలి వ్యక్తులు హిందీలో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆ నేరగాళ్లు తమని తాము పోలీస్ ఆఫీసర్స్ గా పరిచయం చేసుకున్నారు.


కానీ, అనుమానం వచ్చిన యువతి కంగారు పడుతూ తన తండ్రికి ఫోన్ చేయగా.. ఆయన బాగానే ఉన్ననని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. అనంతరం ఈ సంఘటన గురించి సైబర్ క్రైం పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సైబర్ నేరగాళ్లు రూట్ మార్చి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, ఒకవేళ ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని, వెంటనే సమీపంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు

Also read :Sircilla Police: అందులో రాష్ట్రంలో నెం.1 స్థానం.. సిరిసిల్ల జిల్లా పోలీసుల ఘనత

Related posts

Share via