June 29, 2024
SGSTV NEWS
CrimeNational

దర్శన్‌ని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలి.. రేణుకా స్వామి పేరెంట్స్!

అభిమానిని హత్య చేసిన కేసులో దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కాగా, రేణుకా స్వామిని కోల్పోవడంతో అతడి పెరేంట్స్, వైఫ్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుడు తండ్రి మాట్లాడుతూ పలు డిమాండ్లు చేశారు

 

అనాలోచితంగా, ఆవేశంలో చేసిన పనులు ఎంతటి అనార్థాలకు దారి తీస్తాయో చెప్పేందుకు సాక్ష్యంగా నిలిచాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రియురాలి పవిత్ర గౌడకు రేణుకా స్వామి అనే వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడన్న అనుమానంతో అతడ్ని బెంగళూరు రప్పించి.. ఓ షెడ్డులో చితక్కొట్టడంతో చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని కారులో కామాక్షి పాళ్యం వద్ద కాల్వలో పడేశారు. అయితే మృతదేహం బయట పడటంతో పోలీసులకు సమాచారం అందింది. మృతుడ్ని చిత్రదుర్గానికి చెందిన రేణుకా స్వామిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. పలువురు నిందితులు పట్టుకోగా.. ఈ హత్య దర్శన్ చేయించాడని కక్కేశారు. దీంతో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు 13 మందిని అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు.

 

ప్రస్తుతం ఈ స్టార్ హీరో పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కొడుకు రేణుకా స్వామిని కోల్పోయి తల్లిదండ్రులు, భర్తను కోల్పోయి భార్య సహానా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. ఇప్పటికే తన భర్తను దర్శన్ హత్య చేయడంపై స్పందించింది భార్య. తమకు పెళ్లై ఏడాదే గడిచిందని, తాను ఇప్పుడు గర్భవతినని, తన భర్త పవిత్ర గౌడకు ఎటువంటి సందేశాలు పంపలేదని, ఒక వేళ పంపి ఉంటే.. వార్నింగ్ ఇవ్వాలి కానీ, చంపేయడమేమిటనీ ప్రశ్నించింది సహానా. తనకు న్యాయం చేయాలంటూ కన్నీరు మున్నీరు అయ్యింది. అదేవిధంగా పుత్ర కోశంలో మునిగి తేలిపోతున్నారు రేణుకా స్వామి పేరెంట్స్. దర్శన్ హీరో కాదని తమ పాలిట విలన్ అంటూ మండిపడుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన బాధితుడు పేరెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు.

 

భవిష్యత్తులో నా కొడుకులాగా మరెవ్వరూ బాధపడకూడదంటే.. దేవుడు అతడి సరైన శిక్ష విధించాలి. నా కోడలు ప్రెగ్నెంట్. నేను రిటైర్డ్ అయ్యాను.ఆమె తన జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది’ అంటూ శివన్నగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు కించపరిచే సందేశాలు పంపి ఉంటే.. తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. అలాగే దర్శన్‌ను కన్నడ సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. దర్శన్ అభిమానులకు సైతం అతడు చేసిన ఘోరమైన నేరంపై అవగాహన కల్పించాలని కోరారు. ఇదిలా ఉంటే కేవలం రేణుకా స్వామికి వార్నింగ్ మాత్రమే ఇవ్వమని చెప్పినట్లు పోలీసుల విచారణలో ఈ స్టార్ హీరో చెప్పినట్లు తేలింది. కానీ అతడ్ని హింసిస్తున్నప్పుడు అక్కడే ఉన్నట్లు సమాచారం. అతడు చనిపోయాక.. కాల్వలో పడేసేంత వరకు అతడి ప్రమేయం ఉందని బెంగళూరు పోలీసులు చెబుతున్నా

Related posts

Share via