SGSTV NEWS
Andhra PradeshCrime

Crime News : నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం


నెల్లూరు జిల్లా లోని రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో పలువురు ఖాతాదారుల అకౌంట్ లలో నగదు మాయం గందరగోళం సృష్టించింది. పలువురి ఖాతాల్లో నగదు మాయమవ్వడం కలకలం రేపింది.బ్యాంక్‌ ఎకౌంట్లలో మైనస్ బ్యాలెన్సు చూపుతుండటంతో ఖాతాదారులు లబోదిబో మంటున్నారు.

Crime News : నెల్లూరు జిల్లా లోని రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో పలువురు ఖాతాదారుల అకౌంట్ లలో నగదు మాయం గందరగోళం సృష్టించింది. పలువురి ఖాతాల్లో నగదు మాయమవ్వడం కలకలం రేపింది.బ్యాంక్‌ ఎకౌంట్లలో మైనస్ బ్యాలెన్సు చూపుతుండటంతో ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. తమకు న్యాయంచేయాలని బాధితులు కోరుతున్నారు. బాధితుల ఖాతాలో నగదు ఎందుకు కట్ అయిందో తెలియక సతమతమవుతున్నారు.

బ్యాంకు సిబ్బందికి తెలుపగ విచారించి చెబుతామంటూ సమాధానమివచ్చారని ఖాతాదారులు వెల్లడించారు. కాగా సైబర్ దాడికి గురయ్యారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు బాధితులు రాపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాధితులు ఫిర్యాదు మేరకు రెండు లక్షల లోపు నగదు  స్వాహా చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చూసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read

Related posts