ఏలూరులో 35 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన సురేంద్ర కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు ఉన్నాయి. స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
ఏలూరు శివారులోని చోదిమెళ్లకి చెందిన 35 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె భర్త సురేంద్ర కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. సురేంద్ర కాళ్లు, చేతులకు బ్లేడ్‌తో కోసిన గాయాలు, రక్తం కారుతుండటాన్ని స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దేవికకు, సురేంద్రకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అనుమానస్పద మృతి..
దంపతులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అయితే కుటుంబంలో ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. కానీ దేవిక ఉరివేసుకుని అనుమానాస్పదంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దేవిక మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పోలీసులు సురేంద్ర, దేవిక మధ్య కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేదా వారి వృత్తి పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దేవిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025