పల్నాడు జిల్లా, వినుకొండ పట్టణంలో ఆదివారం నుండి అత్త ఇంటి ఎదుట ఓ కోడలు బైటాయించి ఆందోళన చేస్తుంది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి, పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డు చౌడమ్మ వీధికి చెందిన వినుకొండ కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్ 4 వ తేదీన వివాహం అయింది. పెళ్లి జరిగిన రెండు నెలల నుండి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు తెలిపారు. తాను నల్లగా ఉన్నానని భర్త, నీవు మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి అశుభాలు జరుగుతున్నాయని అత్త మామ వేధిస్తున్నట్లు బాధితురాలు గోపి లక్ష్మి చెప్పింది.

ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబంలో ఇస్తే నా కూతురు బాగా బతుకుతుందని భావించిన తన తల్లిదండ్రులు.. గుంతనాల వెంకటనారాయణ హనుమాయమ్మ తమకున్న రెండు ఎకరాల పొలం తాకట్టుపెట్టి 12 లక్షలు డబ్బులు, 25 సబర్ల బంగారం కట్నం గా ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని భర్త, అత్త, మామ వేధిస్తున్నారని వాపోయింది.. ఈ వరకట్న వేధింపులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు పెద్ద మనుషులతో కలిసి వచ్చి మాట్లాడారని.. అమ్మాయి నల్లగా ఉంది తనకు అక్కర్లేదని భర్త కోటేశ్వరరావు పేర్కొన్నాడని చెప్పింది.. అలాగే.. తాను వచ్చినప్పటినుండి తమకు బాగా లేదంటున్నారని.. మామ వెంకటేశ్వర్లు, అత్త శేషమ్మ లు అంటున్నారని రోధిస్తూ బాధితురాలు వాపోయింది.
మహా అయితే పోలీసులు కేసు పెడతారు, తమకు పుష్కలంగా రాజకీయ అండ దండలు ఉన్నాయని.. బెయిల్ మీద బయటకు వస్తాం అంతకంటే ఏమవుతుందని బెదిరిస్తున్నట్లు లక్ష్మీ తెలిపారు. డబ్బులు కోసం యువతులను మోసం చేసి పెళ్లి చేసుకుని వేదించే ఇటువంటి వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు గోపి లక్ష్మి పేర్కొంది.. ఆమె భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగగానే భర్త, అత్తమామలు ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోయారు. గోపి లక్ష్మి బంధువులు కూడా ఆమెకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
- పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!





