శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు గానీ ఇక్కడి ఆలయ కోనేరులో దూకి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీడియోలో మహిళా కోనేరులో దూకడం..
మంగళగిరి, అక్టోబర్ 16: గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు గానీ ఇక్కడి ఆలయ కోనేరులో దూకి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీడియోలో మహిళా కోనేరులో దూకడం కనిపించింది. చీర కట్టుకున్న ఓ మహిళ నడుకుంటూ వచ్చి కోనేరు గట్టు ఎక్కి ఒక్కసారిగా నీళ్లలో దూకింది. మహిళ మృత దేహం నీటిపై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. ఇందులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరీలను పరిశీలించగా మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళ మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే..?
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కుంభ రాశి వారికి ఎలా ఉందంటే..?
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే..?
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటే..?
- Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే..?





