పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు, TTD మాజీ AVSO సతీష్‌కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా కోమలి దగ్గర సతీష్‌కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మొన్న రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన సతీష్‌కుమార్.. నిన్న ఉదయం రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహం లభ్యమవడం అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ.. ఏం జరిగింది?.. సతీష్‌కుమార్ మృతిపై పోలీసుల వర్షెనేంటి…?
తిరుమల పరకామణి కేసులో కీలకంగా ఉన్న టీటీడీ మాజీ AVSO (అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్) సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా పడి ఉన్నారు. తిరుమల పరకామణిలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తుండగా విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న సతీష్‌కుమార్ పట్టుకున్నారు. 2023 ఏప్రిల్‌లో రవికుమార్‌పై సతీష్‌కుమార్ ఫిర్యాదు చేయగా.. అదే ఏడాది మే 30న ఆయనపై విజిలెన్స్ అధికారులు ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ కేసును సతీష్‌కుమార్ విత్‌డ్రా చేసుకున్నారు. కూటమి సర్కారు వచ్చాక పరకామణి వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు.. కొందరు కోర్టును ఆశ్రయించడంతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. అయితే.. దర్యాప్తు కీలక దశకు చేరిన సమయంలో సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.

పరకామణిలో డాలర్ల చోరీ కేసులో తిరుపతిలో సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలడం సంచలనంగా మారింది. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్‌కుమార్ ఈ నెల 6న సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి రైలులో బయలుదేరారు. ఈ క్రమంలోనే.. తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. అయితే.. టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్‌కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్పీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పరకామణి కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారని.. సతీష్‌కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాధమికంగా హత్యగా నిర్ధారించిన పోలీసులు.. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక.. సతీష్‌కుమార్ మృతిపై టీటీడీ బోర్డు సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్‌కుమార్ మృతిలో కుట్ర ఉందన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు MS రాజు. పరకామణి కేసులో సతీష్‌కుమార్ సాక్ష్యం కీలకం కావడంతో ఆయన మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సతీష్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు టీటీడీ బోర్డు మరో సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి. సతీష్‌కుమార్‌ది హత్యా?, ఆత్మహత్యా? అనే కోణంలో ఎంక్వైరీ జరగాలన్నారు. బైట్.. భానుప్రకాష్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు
సతీష్‌కుమార్ ఆత్మహత్య వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి. సతీష్‌కుమార్‌ది ముమ్మాటికి ప్రభుత్వహత్యే అన్నారు. సతీష్ మృతిపై సీబీఐ విచారణ జరపాలన్నారు.
ఇదిలావుంటే… సతీష్‌కుమార్ కింద పడ్డ ప్రాంతం నుంచి సుమారు 70 మీటర్ల దూరంలో ఆయన మృతదేహం ఉండడంతో అసలేం జరిగిందనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
- Andhra: రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ ఇదే..
- Telangana: 21 ఏళ్ల నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉంది.. దూరపు బంధువునని లోపలికి వచ్చాడు.. ఆపై
- Andhra: సీబీఐ నుంచంటూ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
- Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?
- Andhra News: కాకి పెట్టిన మంట..! కాలి బూడిదైన నాలుగిళ్లు.. అసలు మ్యాటర్ తెలిస్తే..





