ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ప్రభుత్వ కళాశాలలో క్లాసులు చెప్పే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. విషయం తెలియడంతో గ్రామస్తులు ఆ గురువుకు దేహశుద్ధి చేసి పాఠశాల నుంచి పంపేశారు. బాధిత బాలిక తండ్రి లేకపోవడం, తల్లి మూగ కావడంతో గ్రామం మొత్తం ఆమెకు అండగా నిలిచింది.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న బాలికల ప్రభుత్వ కళాశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు క్లాసులు చెప్తూ ఉండేవాడు. ఒక విద్యార్థిని పట్ల ఆ ఉపాధ్యాయుడు అనుచిత ప్రవర్తన చేశాడనే సమాచారం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక ఆ సమాచారాన్ని తల్లిదండ్రులుకు చేరవేయడంతో బంధువులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకొని ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. గ్రామస్థులు ఆగ్రహంగా ఉండటంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయుడిని అక్కడి నుంచి పంపించివేశారు. బాధిత విద్యార్ధినికి తండ్రి లేకపోవడం, తల్లి మూగ కావడంతో ఆమెకు మద్దతుగా గ్రామస్థులంతా తరలివచ్చారు. గతంలో ఈ ఉపాధ్యాయుడు పనిచేసిన పాఠశాలల్లో కూడా ఇలాగే విద్యార్థునుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఒక పక్క విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పదేపదే ఉపాధ్యాయులు నైతిక విలువలు పాటించాలని చెప్తున్నప్పటికీ కొంతమంది ఉపాధ్యాయుల తీరులో మార్పు రావటం లేదు. గతంలో ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ, పాకల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయులపై కేసులు నమోదైనా కొంతమంది తమ తీరుమార్చుకోవడం లేదు. తాజాగా నాగులుప్పలపాడు మండలంలో జరిగిన ఘటనపై తీవ్ర భయాందోళనలకు గురైన విద్యార్ధిని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని పోలీసులు చెబుతున్నార.. అయితే ఈ కేసు విషయంలో నిందితుడిపై పోలీసులు సుమోటోగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు…
నాగులుప్పలపాడు మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బక్క ముంతల వినయ్ విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు డిప్యూటీ డీఈఓ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు… గ్రామస్తులు పాఠశాల మహిళ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులకు అందించిన ఫిర్యాదు మేరకు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బక్కమంతల వినయ్‌ను విద్యాలయం నుంచి తప్పించి అతనిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి శాఖాపరమైన విచారణ చేస్తున్నారు
Also Read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





