SGSTV NEWS online
Andhra PradeshCrime

ఎంతకు తెగించావురా.. భార్యపై అనుమానం.. భర్త ఏం చేశాడో తెలుసా..?




ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామంలో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అనుమానం భూతమే.. ఈ ఘటనకు కారణమని.. గొడవ అనంతరం భార్యను చంపిన భర్త.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు.  వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామంలో ఫలతోటి రామారావు(45), ఫలతోటి అరుణ (40) భార్యాభర్తలు.. కుటుంబ కలహల కారణంగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా రామారావుకు భార్య అరుణ ప్రవర్తనపై అనుమానాలు ఉన్నాయి. గత కొంత కాలంగా అనుమానం.. పెనుభూతమై.. గొడవలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రాత్రి కూడా ఎప్పటిలాగే భార్యాభర్తలు గొడవలు పడ్డారు. అయితే, ఈసారి కోపంలో భర్త రామారావు భార్య అరుణపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంంతో ఆమె చనిపోయింది. ఆ తరువాత తాను కూడా పరుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.


ఈ విషయం తెలుసుకుని.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న ఈ దారుణ నిర్ణయంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు. అన్యోన్యంగా ఉండాల్సిన సంసారంలో అనుమానం పెనుభూతంగా మారి ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడంతో పిచ్చుకలగుడిపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also read

Related posts