మద్యం మత్తులో మనిషి విచక్షణ కోల్పోతే.. ఆ పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి విజయనగరంలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. భార్య మందలించిందని, సంసారం గడవట్లేదని చేసిన హెచ్చరికను అర్థం చేసుకోలేక.. ఆవేశంలో ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పసికందులను తండ్రి లేని వారిని చేసింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో అందరినీ కలిచివేసింది. గాంధీనగర్‌కు చెందిన బెవర శ్రీనివాస్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలసి సరదాగా తిరుగుతూ మద్యానికి అలవాటు పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత దానికి బానిసయ్యాడు. రోజువారీ పనులు చేసుకొని వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించే శ్రీనివాస్ మద్యం వ్యసనం కారణంగా ఇంట్లో డబ్బులు ఇవ్వడం మానేశాడు. రాను రాను ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు పెరిగి ఒత్తిడికి దారి తీశాయి. రోజురోజుకు భర్త పరిస్థితి క్రమంగా క్షీణిస్తుండటంతో భార్య రేవతి పలుమార్లు మందలించింది.
కుటుంబ భవిష్యత్తు, ఇద్దరు పిల్లల సంగతి ఏంటో ఆలోచించమని నిత్యం శ్రీనివాస్‌ను వారిస్తూ మద్యపానాన్ని ఆపివేయాలని చెప్పేది. భార్య రేవతి ఎంత చెప్పినా పెడచెవిన పెట్టి మద్యం మత్తులో ఉండేవాడు శ్రీనివాస్. ఈ క్రమంలోనే సాయంత్రం సమయంలో మద్యం మత్తులో ఇంటికి చేరడంతో భార్య రేవతి మరోసారి వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో రేవతి మాటలు శ్రీనివాస్‌ను మరింత బాధపెట్టాయి. కొంతసేపు తనలో తాను ఆలోచనల్లో మునిగిపోయిన శ్రీనివాస్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యం వ్యసనం కారణంగా ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయిన విషాదం స్థానికులను కలచివేసింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం అలవాటు ఇంటిని ఎలా నాశనం చేస్తుందో ఈ ఘటన అందరినీ ఆలోచింపజేసింది.
Also read
- ఫుల్లుగా తాగొచ్చిన భర్త.. భార్య తిట్టడంతో ఇంట్లో ఎవరూ సమయంలో ఘోరం..
- అవిముక్తేశ్వరానందపై లైంగిక వేధింపుల కేసు.. పోక్సో కోర్టు ఆదేశాలతో FIR నమోదు!
- Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..
- Lord Shani: పేదలను హింసించే.. వారికి శని శిక్ష తప్పదట!
- శివుడిని సోమవారం మాత్రమే ఎందుకు పూజిస్తారో తెలుసా?





