SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ ఇదే..


కృష్ణా జిల్లాలో ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది.నిబంధనలకు విరుద్ధంగా మార్గ మధ్యలో వాహనాన్ని ఆపి రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేయడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఎస్కార్ట్ సిబ్బంది ప్రసాద్‌, శివప్రసాద్, కిరణ్‌.. సురేష్‌, ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు విధిస్తూ ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ ఎస్కేప్ ఘటనతో రిమాండ్ ఖైదీలతో వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ వాహనం ఎక్కడా అపొద్దని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఎస్కార్ట్ సిబ్బంది ఉల్లంఘించడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టయిన భాస్కర్ రెడ్డితో కలిసి ఎస్కార్ట్ సిబ్బంది హోటల్లో టిఫిన్ చేశారు. భాస్కర్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.. అయితే.. అతన్ని వాయిదాల విషయంలో జైలుకు, కోర్టుకు తరలించే క్రమంలో.. నిబంధనలకు విరుద్ధంగా మార్గ మధ్యలో వాహనాన్ని ఆపి రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.. దీంతో పాటు సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి..

ఈ ఘటనపై ఎస్పీ సిరియస్ అయ్యారు. ఎస్కార్ట్ సిబ్బంది అందరినీ.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మోస్ట్ వాంటెడ్ ఎస్కేప్ ఘటనతో రిమాండ్ ఖైదీలతో వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ వాహనం ఎక్కడా అపొద్దని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఇలా చేయడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read

Related posts