అదో జిమ్.. చాలామంది ఉదయాన్నే అక్కడకు చేరుకుని వ్యాయామాలు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి తనిఖీలు చేయడం మొదలు పెట్టారు.. దీంతో అక్కడ ఏం జరుగుతోందనన్న టెన్షన్ మొదలైంది.. కట్ చేస్తే.. భారీగా స్టెరాయిడ్స్ లభ్యమయ్యాయి.. ఈ షాకింగ్ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.. జిమ్ లో పోలీసులు పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
అదో జిమ్.. చాలామంది ఉదయాన్నే అక్కడకు చేరుకుని వ్యాయామాలు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి తనిఖీలు చేయడం మొదలు పెట్టారు.. దీంతో అక్కడ ఏం జరుగుతోందనన్న టెన్షన్ మొదలైంది.. కట్ చేస్తే.. భారీగా స్టెరాయిడ్స్ లభ్యమయ్యాయి.. ఈ షాకింగ్ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.. జిమ్ లో పోలీసులు పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. విజయవాడలోని ఎనీటైమ్ ఫిట్నెస్ సెంటర్‌లో రసూల్ అనే యువకుడు జిమ్‌కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని పలు జిమ్‌లకు కూడా రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే సునీల్ వ్యక్తితో కలిసి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు తేలింది. దీంతో ఈగల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనీటైమ్ ఫిట్నెస్ సెంటర్‌లో సంయుక్తంగా దాడులు చేశారు.. ఈ తనిఖీల్లో భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సమీర్, సునీల్ జిమ్‌లల్లో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారంతో ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న సమీర్ స్నేహితుడు సునీల్ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టుకోవడం కలకలం రేపింది
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





