తాగుబోతు భర్తలను వదిలి చాలామంది భార్యలు పుట్టింటికి వెళ్తారు. అయితే ఆ తర్వాత భర్తలు.. వారిని బతిమాలో బామాలో వారివారి భార్యలను తమ వద్దకు తెచ్చుకొని కాపురాలు చేసుకుంటున్నారు.. కానీ ఇప్పుడు మీరు వింటున్న సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. పుట్టింటికి వెళ్లి భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు ఓ భర్త. తన పేరుపై డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఆమెకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు మండలం దూలంవారి పల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి ఆమె భర్త అయిన జమ్మలమడుగు నియోజకవర్గ ముద్దనూరు మండలానికి చెందిన మారుతీ రాజు షాక్ ఇచ్చాడు. బతికి ఉన్న తన భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపించి నన్ను వదిలి వెళ్లిన నువ్వు చచ్చిన దానితో సమానం అంటూ తన అహాన్ని బయట పెట్టాడు. వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా మారుతీ రాజు నిత్యం తాగి భార్యను వేధిస్తుండడంతో.. 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి తన ముగ్గురు పిల్లలను భర్త దగ్గరే వదిలి కలసపాడు మండలం దూలంవారిపల్లిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే దీనిపై ఆగ్రహించిన భర్త మూర్తి రాజు ఆమె పేరు మీద మరణ ధృవీకరణ పత్రం తీసి పంపడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కలసపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె పోలీసులను ఆశ్రయించింది. నేను బ్రతికి ఉన్నా.. నా భర్త నాకు మరణ ధృవీకరణ పత్రాన్ని అందజేశాడని ఫిర్యాదు చేసింది. దాంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ నెల 12వ తేదీ ఆ మరణ ధృవీకరణ పత్రం ముద్దనూరు గ్రామ పంచాయతీ నుంచి జారీచేసినట్టు మరణ దృవీకరణ పత్రంలో ఉంది. అయితే అంత త్వరగా మరణ దృవీకరణ పత్రం ఇష్యూ చేస్తారా అనేదానిపై అనుమానం కలుగుతుంది.. అసలు ఈ మరణ ధృవీకరణ పత్రాన్ని ఎలా ఇష్యూ చేశారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆధారాలు ఏమి ఇచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు అనే దానిపై ఇప్పుడు స్థానికంగా చర్చ నడుస్తుంది. బతికున్న వ్యక్తికి అంత అజాగ్రత్తగా ప్రభుత్వం నుంచి డెత్ సర్టిఫికెట్ ఇష్యూ అవుతుందా అనేది కూడా చర్చినీయాంశమే.. ఏది ఏమైనా తన భార్యకు భర్త ఇచ్చిన షాక్ మాత్రం గట్టిదే అని అంటున్నారు స్థానికులు. ఏది ఏమైనా తాగుబోతు భర్తను వదిలి వెళ్లిన భార్య.. భర్త ఇచ్చిన షాక్‌తో పోలీసులను ఆశ్రయించింది… తన ముగ్గురు పిల్లలను భర్త వద్ద వదిలి వెళ్లిన ఆమె పిల్లల కోసం అయినా తన భర్త చేసిన పనిని క్షమిస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న.
Also Read
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..





