గుంటూరు నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. స్థంభాల గరువుకు చెందిన కరిముల్లా తురకపాలెం వెళ్లే రోడ్డు పొదల్లో శవమై కనిపించాడు. అయితే అతన్ని ఎవరూ హత్య చేసి ఉంటారన్న అంశంపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. స్థంభాల గరువుకు చెందిన కరిముల్లాకు వివాహం అయింది. అయితే మద్యం తాగి జులాయిగా తిరుగుతుండటంతో భార్య అలిగి వెళ్లిపోయింది. అయితే ఆమె తమ పుట్టింటికి వెళ్లకుండా కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్లి కాపురానికి రమ్మని అడిగానా ఆమె రాలేదు. అయితే ఈ క్రమంలో కరిముల్లా వదినకు స్థంభాల గరువుకు చెందిన శివరామరాజుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు కరిముల్లా గుర్తించాడు.
అంతేకాకుండా తన భార్య కూడా వెళ్లి వదిన వద్దే ఉండటంతో అతని భార్య ప్రవర్తనపై కూడా కరిముల్లాకి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని పసిగట్టిన శివరామరాజు కరిముల్లా అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. కరిముల్లాకి ఉన్న మద్యం వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని హత్య చేయాలని అనుకున్నాడు. వెంటనే శివరామరాజు స్నేహితుడైన మధుసూధన రెడ్డిని సంప్రదించాడు.
డబ్బు ఆశ చూపి కరిముల్లా అడ్డు తొలగించాలన్నాడు. దీంతో రంగంలోకి దిగిన మధుసూధన్ రెడ్డి గత పదిహేను రోజులుగా కరిముల్లాతో స్నేహం చేసి మద్యం పోయించేవాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తుండటంతో కరిముల్లా మధుసూధన్ రెడ్డితో పాటు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్దమయ్యాడు. రెండు రోజుల క్రితం మద్యం సేవించడానికి తురకపాలెం రోడ్డులోకి తీసుకెళ్లిన మధుసూధన్ రెడ్డి.. అక్కడే కరిముల్లా గొంతు కోసి హత్య చేసి పొదల్లోకి నెట్టేసి వచ్చాడు.
అయితే పోలీసులు మధుసూధన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా శివరామరాజు అంశంపై తెరపైకి వచ్చింది. మొదట తనకేమి తెలియదని శివరామరాజు బుకాయించిన మధుసూధన్ రెడ్డి ఇచ్చిన ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..