ఓవైపు రైలు కూత.. మరోవైపు మత్తు మోత. ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో గంజాయిని గట్టు దాటించబోయారు. గమ్యం ఎక్కడో కానీ పల్నాడులోకి ఎంటర్ కాగానే కేటుగాళ్ల ప్లాన్ పంక్చరైంది. 2వేల గంజాయి చాకెట్లును సీజ్ చేశారు పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. గంజాయి చాక్లెట్లను తరలిస్తోంది అంతర్ రాష్ట్ర గ్యాంగ్‌నా లేదంటే లోకల్ ముఠానా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ నిఘాను పెంచి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ.. గంజాయ్ గ్యాంగ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అయినా.. కాదేది అక్రమ బట్వాడాకు అనర్హం అన్నట్టుగా మత్తు మాఫియా పేట్రేగుతోంది. ఇంతకాలం బైకులు, కార్లు ఇతర వాహనాలతో సప్లై చేసిన కేటుగాళ్లు.. రైలును కూడా అక్రమ రవాణాకు మార్గంగా చేసుకున్నారు.. ఐతే పక్కా సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా పోలీసులు.. ప్రశాంతి ఎక్స్ ప్రెస్‌ను ఆపి తనిఖీలు చేశారు. అంతే ఓ బోగిలో గంజాయి గుట్టు గుప్పుమంది. లగేజీని చెక్ చేస్తుండగా చాక్లెట్ బ్యాగేజీ బయటపడింది. పిప్పరమెంట్లే కాదని లైట్‌గా తీసుకోలేదు పోలీసులు. పరీక్షిస్తే ఇవి మాములు చాక్లెట్లు కాదు గంజాయి సరుకు అని నిర్దారించుకున్నారు. లెక్కేస్తే గంజాయి చాక్లెట్ల కౌంట్ దాదాపు 2వేలు పైచిలుకు ఉంది.
ఈ సరుకు ఎక్కడిది? ఎవరు ? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పల్నాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సరుకు దొరికింది. కానీ ఖాకీల రాకను పసిగట్టిన కేటుగాళ్లు.. బ్యాగులను ట్రైన్లో సీటు కింద వదిలేసి ప్రశాంతి ఎక్స్ ప్రెస్ నుంచి పలాయనం చిత్తగించారు. అసలు ట్రైన్‌లోకి ఈ బ్యాగులు ఎవరు తెచ్చారు? ఎక్కడ ట్రైన్ ఎక్కారు? వాళ్లు ఎలా వున్నారు? ఏ భాషలో మాట్లాడరు? అంటూ ప్రయాణికుల నుంచి డేటా సేకరించారు పోలీసులు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. గంజాయి చాక్లెట్లను తరలిస్తోంది అంతర్ రాష్ట్ర గ్యాంగ్‌నా లేదంటే లోకల్ ముఠానా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మత్తు చాక్లెట్లతో పాటు ఖతర్నాక్ క్లూ కూడా దొరికినట్టుంది. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు పల్నాడు పోలీసులు
Also Read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




