అన్న భార్య వదిన.. అంటే అమ్మతో సమానం..అన్న చనిపోయాడు.. ఆమె పిల్లలతో ఎలాగోలా కాలం వెళ్లదిస్తోంది.. కానీ.. మరిది మాత్రం అదేం చూడలేదు.. జాలి చూపించాల్సింది పోయి ఆమెపై కన్నేశాడు.. కామ కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఆమె తప్పు అంటూ ఎంత చెప్పినా.. వినలేదు.. తన కోరికలు తీర్చకపోతే.. యాసిడ్ పోసి చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు.. దీంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది.. ఎలా చెప్పుకోవాలో తెలియక.. చివరకు పోలీసుస్టేషన్ వెళ్లింది. మరిది బెదిరింపుల గురించి.. జరిగినదంతా చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రొంపిచర్ల పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. రొంపిచర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (34) పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్త ఏడాదిన్నర కిందట చనిపోగా.. ఆమె.. కూలీ పనులకు వెళ్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది.
ఈ క్రమంలోనే.. పిల్లలను పోషిస్తూ ఒంటరిగా జీవిస్తున్న వదినపై.. మరిది శామ్యూల్ కన్నేశాడు. గతంలో కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు.. ఓ సారి అత్యాచారయత్నం సైతం చేశాడు. విషయం పెద్ద మనుషుల వరకు వెళ్లడంతో పంచాయితీ పెట్టారు.. ఇకపై అలా ప్రవర్తించనంటూ అప్పుడు ఆమె కాళ్లు పట్టుకున్నాడు.
అయినా సరే ప్రవర్తన మార్చుకోని శామ్యూల్.. ఫిబ్రవరి 16న రాత్రి నిద్రిస్తున్న ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె ఎదురుతిరగింది. అప్పుడు శామ్యూల్ వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ఆమెపై పోసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె తప్పించుకుంది.
ఈ ఘటనతో తీవ్ర మనస్థాపం చెందిన బాధితురాలు.. బుధవారం బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మరిది నుంచి ప్రాణహాని ఉందని.. తనను రక్షించాలని వేడుకుంది. గతంలో ఓ సారి తనపై అఘాయిత్యానికి యత్నించాడని వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు.. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also read
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
- ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య.. కంపెనీలో చేరిన పది రోజుల్లోనే
- వివాహితను నమ్మించి వంచించిన కేడీలు





