హర్రర్ మూవీలలో క్షుద్ర పూజలు, చేతబడులు, దెయ్యాలును చూస్తేనే మనం గజగజ వణికిపోతాం. ఒంటరిగా ఉన్నప్పుడల్లా కొద్ది రోజుల పాటు అవే సీన్లు గుర్తుకు వచ్చి ఒంటరిగా ఉండాలన్నా భయపడిపోతాం. మరి సినిమాల్లో చూపించే ఆ సీన్‌లే మన ఊరులోనో, మన ఇంటి పరిసరాల్లోనో కనిపిస్తే ఎలా ఉంటుంది.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం డెప్పిలి గోనపపుట్టుగ గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోని చెల్లెమ్మ చెరువు మీదుగా నీలాపుపుట్టుగ గ్రామానికి వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. రహదారి మధ్యలో పిండితో పుర్రె బొమ్మ వేసి, ముగ్గు వేసి ఉంది. ముగ్గు మధ్యలో వరిగడ్డితో చేసిన బొమ్మ, వేపకొమ్మలు పెట్టారు. సినిమాల్లో చూపించేలా ముగ్గు మధ్యలో పెట్టిన గడ్డితో చేసిన బొమ్మకు వస్త్రం కూడా చుట్టారు. ముగ్గుకి ఇరువైపుల కూర్చొని పూజలు చేసినట్టుగా రెండు వైపుల బొంత, చాప పరిచి ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి. గత 2 రోజుల నుంచి రాత్రిపూట ఇలా జరుగుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. తమ ఊరులో గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదని గ్రామస్తులు అంటున్నారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





